01-09-2025 NORMAL NEWS 09:48 AM
swarnodayam.com
Telugu Daily News
01-09-2025 09:48 AM By Mandala Yadagiri

కాకతీయ కాలనీ గణపయ్య సన్నిధిలో ముగ్గుల పోటీలు…

కాకతీయ కాలనీ గణపయ్య సన్నిధిలో ముగ్గుల పోటీలు…
IMG-20250901-WA0007

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హుజురాబాద్ పట్టణంలోని కాకతీయకాలనీలోని గణపతి మండపం వద్ద ఆదివారం ఉత్సవ కమిటీ ముగ్గుల పోటీ నిర్వహించారు. ఈ పోటీలలో కాకతీయ కాలనీ మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని పోటాపోటీగా ముగ్గులు వేశారు. అనంతరం ముగ్గుల పోటీలో గెలుపొందిన మహిళలకు హుజురాబాద్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల- శ్రీనివాస్ బహుమతులు ప్రధానం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో విజ్ఞేశ్వరుని పూజించాలని అన్నారు. హుజురాబాద్ పట్టణ ప్రజలకు విజ్ఞేశ్వరునీ ఆశీస్సులతో సకల లాభాలు కలగాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు సదాశివ రెడ్డి, శుభాషన్ రెడ్డి, వడ్లూరి ధనలక్ష్మి- సుదర్శన్, తాటిపాముల స్వరూప-దేవేందర్, శరణ్య, జున్నోజు శ్యామల- భాస్కర్, జోన్నోజు లవన్, జోన్నోజు సందీప్, తిప్పర్తి వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు.

ముగ్గుల పోటీలలో విజేతలైన ముగ్గురు మహిళలకు బహుమతులు అందజేస్తున్న మున్సిపల్ తాజా మాజీ వైస్ చైర్ పర్సన్ కొలీపాక నిర్మల శ్రీనివాస్

—————–+++++++———————-

&&పత్రికా ప్రకటనలు&&

————-++++++———————–

##వార్షికోత్సవ శుభాకాంక్షలు##

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!