Social 1080×1350 • Multi-page
01-09-2025 BREAKING NEWS 09:09 PM
swarnodayam.com
Telugu Daily News

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంలో జాప్యం తగదు.. – ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు, బీసీ కుల జన గణన మండల కన్వీనర్ మార్త రవీందర్

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంలో జాప్యం తగదు.. – ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు, బీసీ కుల జన గణన మండల కన్వీనర్ మార్త రవీందర్
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించినట్లుగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో జాప్యం చేయడం తగదని ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు, బీసీ కుల జన గణన మండల కన్వీనర్ మార్త రవీందర్ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ…శాసనసభ సమావేశాలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టసభలో ఏకగ్రీవంగా శాసనసభ్యులు అందరు కలిసి తీర్మానం చేసినందుకు ఎమ్మెల్యే లందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడైనా బీసీలు ఎదగడానికి చట్టసభలలో, స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు అమలు చేయుటకు చిత్తశుద్ధితో అన్ని పార్టీలు అమలు చేయుటకై గవర్నర్ ను కలవడానికి వెళ్లిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ఒక్కొక్క వాగ్దానాన్ని అమలుపరచడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఆర్టిసి ఉద్యోగులకు రేషన్ కార్డు ఇవ్వడం అభినందనీయమన్నారు

ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు, బీసీ కుల జన గణన మండల కన్వీనర్ మార్త రవీందర్

—————+++++++——————-

@@పత్రికా ప్రకటనలు@@

————++++++——————–

##వార్షికోత్సవ శుభాకాంక్షలు##

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!