02-09-2025 NORMAL NEWS 12:27 PM
swarnodayam.com
Telugu Daily News
02-09-2025 12:27 PM By Mandala Yadagiri

కాలేశ్వరంపై కుట్రలకు నిరసనగా బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో

కాలేశ్వరంపై కుట్రలకు నిరసనగా బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో
IMG-20250902-WA0073

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కాలేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై నిరసనగా బిఆర్ఎస్ పార్టీ చేపట్టిన నిరసనలో భాగంగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కుట్రపూరితంగా కేసీఆర్ ని బధనం చేసే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కాలేశ్వరం ప్రాజెక్టుపై లేనిపోనివి సృష్టించి కమిషన్ల పేరిట కెసిఆర్ ఆనవాళ్లు లేకుండా చేద్దామని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుందని ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణ ప్రజల నుంచి కెసిఆర్ని దూరం చేయడం ఎవరి తరం కాదని అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టుతో లక్షల ఎకరాలకు నీళ్లు అందించిన ఘనత కేసీఆర్ ది అన్నారు. వ్యవసాయాన్ని దండగ అన్న నుంచి పండగల మార్చారని కొనియాడారు. కెసిఆర్ మీద ఎన్ని ఎంక్వయిరీలు వేసినా చివరకు న్యాయమే గెలుస్తుందని అన్నారు. ప్రభుత్వానికి కనీసం రైతులకు యూరియా ఇవ్వడం కూడా సాధ్యం కావడంలేదని అన్నారు. ఒక్క యూరియా బస్తా కోసం రోజుల తరబడి రైతన్నలు ఎదురుచూడాల్సిన దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందని అన్నారు. రైతులకు సరిపడే యూరియాతోపాటు అనంతరం రైతులకు యూరియా తో పాటు రైతు భరోసా, బోనస్ తో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రైతులకు వెంటనే యూరియా పూర్తిస్థాయిలో అందించాలంటూ ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఎమ్మార్వో కనుకయ్యకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ మాజీ చైర్మన్ గందె రాధిక, శ్రీనివాస్, వైస్ చైర్మన్ కొలిపాక నిర్మల శ్రీనివాస్, పిఎసిఎస్ చైర్మన్ ఎడవల్లి కొండల్ రెడ్డి, మాజీ ఎంపీపీ ఇరుమల్ల రాణి సురేందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు తాళ్లపల్లి శ్రీనివాస్, ముక్క రమేష్, ప్రతాప తిరుమల్ రెడ్డి, అపరాధ ముత్యంరాజు, జి ఉమామహేశ్వర్, ప్రతాప మంజుల కృష్ణ, కుమార్, కొండ్ర నరేష్, రోశందర్, ఇమ్రాన్, కుమారస్వామి, చింత శ్రీను, మైకేల్, సమ్మయ్య, రియాజ్, ఫయాజ్, దిల్ శీను, బిక్షపతి, శ్రీనివాస్, కిరణ్, తిరుపతి, మహిళా నాయకురాలు శిరీష, కొయ్యడ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

వరంగల్ కరీంనగర్ ప్రధాన రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించి తాసిల్దార్ గురించి పత్రం అందజేస్తున్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!