02-09-2025 NORMAL NEWS 03:08 PM
swarnodayam.com
Telugu Daily News
02-09-2025 03:08 PM By Mandala Yadagiri

బిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్.

బిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్.
IMG_20250902_150055

స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్, సేప్టెంబర్ 2: అందరూ అనుకున్నట్లే జరిగింది… పార్టీకి నష్టం చేసే ప్రకటనలు చేస్తూ అధి నాయకత్వాన్ని ఇబ్బందుల పాలు చేస్తున్న ఎమ్మెల్సీ కవితను పార్టీ వేటు వేస్తుందని ప్రచారం జరిగింది.. నేడు నిజమైంది. ఎం.ఎల్.సి కవితను బిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బిఆర్ఎస్ ప్రకటించింది. ఆమె వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని సస్పెన్షన్ వేటు వేసినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు ప్రకటన విడుదల చేశారు. కొంతకాలంగా కవిత పార్టీ వ్యతిరేక స్వరాన్ని వినిపిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న ఏకంగా హరీశ్ రావుపైనే అవినీతి ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న పార్టీ అధిష్టానం ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేయడంతో అందరూ ఊహించినట్లుగానే సస్పెన్షన్ కు గురయ్యారు. దీనితో పార్టీని ఎవరు ధిక్కరించిన చర్యలు తప్పవని అధిష్టానం చెప్పకనే చెప్పినట్లుగా పలువురు భావిస్తున్నారు.

ఎమ్మెల్సీ కవిత….

ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన పార్టీ ప్రధాన కార్యదర్శి టి రవీందర్రావు…

బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!