Social 1080×1350 • Multi-page
02-09-2025 BREAKING NEWS 03:55 PM
swarnodayam.com
Telugu Daily News

పాపయ్యపల్లిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు.

పాపయ్యపల్లిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు.
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకుడు, హుజురాబాద్ నియోజకవర్గం నాయకుడు పల్లె మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో మండలంలోని పెద్ద పాపయ్యపల్లి గ్రామంలో గల హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజల అందరి మంచి కోరుకునే నిస్వార్ధ ప్రజా సేవకుడు పవన్ కళ్యాణ్ జన్మదినం ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని, దేవుని దీవెనలతో, ప్రజల అండదండ లతో మరిన్ని విజయాలు సాధించాలాని స్వామి వారిని వేడుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు అనిల్, అజయ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా హుజురాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేపిస్తున్న జనసేన పార్టీ జిల్లా నాయకుడు పల్లె మహేష్ గౌడ్..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!