Social 1080×1350 • Multi-page
03-09-2025 BREAKING NEWS 07:07 PM
swarnodayam.com
Telugu Daily News

హుజూరాబాద్ ఎంవిఐ నూతన భవన నిర్మాణానికి కృషి : – రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ పడాల రాహుల్

హుజూరాబాద్ ఎంవిఐ నూతన భవన నిర్మాణానికి కృషి :  – రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ పడాల రాహుల్
IMG-20250903-WA0101

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని కెసి క్యాంప్ లో శిథిలావస్థలో ఉన్నటువంటి ఆర్టీవో భవనాన్ని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ కరీంనగర్ జిల్లా మెంబర్ పడాల రాహుల్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎంవిఐ కార్యాలయాన్ని పరిశీలించి హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్ కోరిక మేరకు హుజురాబాద్ పట్టణంలోని ప్రజలకు మెరుగైన సేవలు అందించాడానికి నూతన ఎంవిఐ భవన నిర్మాణం కొరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. వీలు అయినంత త్వరగా ల్యాండ్ అలొకేషన్ చేపించి భవన నిర్మాణ పనులు ప్రారంభించి త్వరతగతిన పూర్తి చేయడానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అంతకుముందు ఆయనకు ఎంవిఐ కే వేణు పూలబోకే ఇచ్చి శాలువా కప్పి కార్యాలయంలోకి ఘనంగా స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కంచి వేణు, యూత్ కాంగ్రెస్ హుజురాబాద్ నియోజకవర్గం అధ్యక్షుడు చల్లూరి రాహుల్, అర్జున్ గౌతంరెడ్డి, జప శ్రవణ్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ పడాల రాహుల్ కు పూల బోకే ఇచ్చి శాలువా కప్పి ఘనంగా స్వాగతం పలుకుతున్న ఎన్ వి ఐ కే వేణు, సిబ్బంది.
ఎంవిఐ కార్యాలయం శిథిలవస్త పై ఫోన్లో రవాణా శాఖ మంత్రి పొన్నంకు వివరిస్తున్న రాహుల్…

————-+++++———————–

&&పత్రికా ప్రకటనలు&&

———–++++++——————–

##వార్షికోత్సవ శుభాకాంక్షలు##

————-+——-++——–++——–
Oplus_16908288

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!