Social 1080×1350 • Multi-page
03-09-2025 BREAKING NEWS 07:54 PM
swarnodayam.com
Telugu Daily News

యూరియా కోసం వ్యవసాయ కార్యాలయం ముందు రైతుల ఆందోళన

యూరియా కోసం వ్యవసాయ కార్యాలయం ముందు రైతుల ఆందోళన
IMG_20250903_194034

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
యూరియా కోసం ఎదురుచూపులు చూస్తూ విసిగి వేసారిన రైతన్నలు బుధవారం హుజూరాబాద్ శాఖ కార్యాలయం ముందు ఆందోళన జరిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ… గత వారం రోజుల నుండి యూరియా కోసం వ్యవసాయ పనులు వదిలేసి సింగిల్ విండో కార్యాలయాల చుట్టూ, ఆగ్రోస్, ఫర్టిలైజర్ల షాపుల చుట్టూ తిరుగుతున్నామని కానీ తమకు మాత్రం యూరియా దొరకడం లేదని అన్నారు. యూరియా ఎప్పుడు వస్తుందో తెలియకపోవడంతో ప్రతిరోజు హుజురాబాద్ కు రావడం ఎదురు చూస్తూ తిరిగి వెళ్ళడం జరుగుతుందని అన్నారు. యూరియా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదు తెలియని అయోమయ పరిస్థితుల్లో రైతు ఉన్నాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు ఎరువుల దుకాణదారులు యూరియా కావాలంటే పొటాష్ తీసుకుంటేనే యూరియా ఇస్తున్నారని వచ్చిన యూరియాను కొంతవరకే రైతులకు ఇచ్చి మిగతా యూరియాను బ్లాక్లో అమ్ముతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి అలాంటి దుకాణాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న రైతులతో హుజురాబాద్ వ్యవసాయ అధికారి భూమి రెడ్డి మాట్లాడుతూ… యూరియా కేటాయింపులు జిల్లా కేంద్రం నుండి జరుగుతాయని ఒక్కొక్క సింగిల్ విండోకు ఒక్కొక్క రోజున వస్తుందని హుజురాబాద్ కు ఆయన తెలిపారు. యూరియా స్టాక్ రాగానే తెలియజేయడం జరుగుతుందని, వచ్చిన యూరియాను రైతులకు తప్పనిసరిగా అందించడం జరుగుతుందని రైతులను శాంతింప చేశారు.

ఏవో భూమిరెడ్డిని నిలదీస్తున్న రైతులు…

రైతులకు నచ్చ చెబుతున్న ఏవో భూమిరెడ్డి…

వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద యూరియా కోసం ఆందోళన చేస్తున్న రైతులు…

——————++++++++——————

&&పత్రికా ప్రకటనలు&&

—————+++++———————–

##వార్షికోత్సవ శుభాకాంక్షలు##

—————++++—————-
Oplus_16908288

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!