Social 1080×1350 • Multi-page
04-09-2025 BREAKING NEWS 06:14 PM
swarnodayam.com
Telugu Daily News

ఎస్ ఆర్ ఎఫ్ గురుబ్రహ్మ అవార్డ్ కు ఎంపికైన విజ్ఞాన్ ‘కోటేశ్వర్’

ఎస్ ఆర్ ఎఫ్ గురుబ్రహ్మ అవార్డ్ కు ఎంపికైన విజ్ఞాన్ ‘కోటేశ్వర్’
IMG_20250904_181040

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: ఎస్ఆర్ఎఫ్ _ శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాద్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పాఠశాలల ఉత్తమ కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ లను ఎంపిక చేయగా హుజురాబాద్ నుండి స్థానిక విజ్ఞాన్ స్కూల్ కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్ గురుబ్రహ్మ అవార్డ్ కు ఎంపికైనట్లు అవార్డ్ కమిటి అద్యక్షులు తుమ్మ అమరేష్ తెలిపారు. కాగా రాష్ట్ర అద్యక్షులు తుమ్మ అమరేష్ అధ్వర్యంలో హైద్రాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీలో నిర్వహించిన అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథి లోక్ సత్తా మాజీ అద్యక్షులు జయప్రకాష్ నారాయణ చేతుల మీదుగా విజ్ఞాన్ కోటేశ్వర్ యాదవ్ కు గురుబ్రహ్మ అవార్డ్ మెమంటో తో పాటుగా గణిత ఉపాధ్యాయుడు కె రమేశ్ కుమార్ కు చుక్క రామయ్య గణిత పురస్కార్ అవార్డ్ మెమంటోను ప్రధానం చేసి సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా అమూల్యమైన సమయాన్ని కేటాయించి అవార్డ్స్ ఇచ్చిన జయప్రకాశ్ నారాయణకి మరియు ఎంపిక చేసిన తుమ్మ అమరేష్ కు కోటేశ్వర్ దన్యవాదాలు తెలిపారు. అవార్డ్స్ రావడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

జయ ప్రకాశ్ నారాయణ చేతుల మీదుగా గురుబ్రహ్మ అవార్డ్ అందుకుంటున్న విజ్ఞాన్ కోటేశ్వర్..

గణిత పురస్కార్ అవార్డ్ అందుకుంటున్న రమేష్ కుమార్..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!