Social 1080×1350 • Multi-page
04-09-2025 BREAKING NEWS 07:13 PM
swarnodayam.com
Telugu Daily News

విద్యాసంస్థల్లో ముందస్తు గురుపూజోత్సవ వేడుకలు

విద్యాసంస్థల్లో ముందస్తు గురుపూజోత్సవ వేడుకలు
IMG-20250904-WA0031

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: స్వర్గీయ మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని గురువారం హుజూరాబాద్ పట్టణంలోని పలు విద్యాసంస్థల్లో ముందస్తు గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాల, వివిధ ప్రభుత్వ పాఠశాలలు, న్యూ శాతవాహన, ఆదర్శ, న్యూ కాకతీయ, కేరళ, శస్త్ర, ఆల్ ఫోర్స్, వివేకవర్ధిని, విజ్ఞాన్, టెట్రా హెడ్రాన్ తదితర పాఠశాలలో గురుపూజోత్సవాన్ని పురస్కరించుకొని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తమకు విద్య నేర్పిన గురువులకు ఆయా పాఠశాలల కళాశాలల విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిరా దేవి, డాక్టర్ లింగారెడ్డి,ఎన్ ఎస్ ఎస్ కో ఆర్డినేటర్ డా.సరళ ఝాన్సీరాణి , డా. ఓదెలు , పల్లవి , డా. సుమలత , డా.రేణుక , డా .స్వరూప రాణి ,రమ , డా. నరేందర్ రెడ్డి , డా.మహిపాల్ రెడ్డి , డా.స్వప్న , వి వెంకటేశ్వర్లు, బి రాజ్ కుమార్, ఎం ప్రసాద్, విన్సెంట్ జార్జ్, నారాయణరెడ్డి, కిరణ్ కుమార్, కోటేశ్వర్, శ్రీనివాస్, వేణుమాధవ్ లతోపాటు పలు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!