Social 1080×1350 • Multi-page
04-09-2025 BREAKING NEWS 11:05 PM
swarnodayam.com
Telugu Daily News

ఉత్సాహంగా ఎస్జిఎఫ్ మండల స్థాయి క్రీడలు

ఉత్సాహంగా ఎస్జిఎఫ్ మండల స్థాయి క్రీడలు
IMG-20250904-WA0085


మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో గురువారం రెండవ రోజు ఎస్ జి ఎఫ్ మండల స్థాయి కబడ్డీ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు చెందిన అండర్ 14, అండర్ 17 విభాగాలలో కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయి ఎస్జీఎఫ్ క్రీడలకు విజేతలను ఎంపిక చేశారు.
అండర్ 14 అండర్ 17 గర్ల్స్ టీ డబ్ల్యూ ఆర్ ఎస్ బాలికల పాఠశాల ప్రథమ స్థానం, ఎం జె పి బాలికల పాఠశాల ద్వితీయ స్థానం, అండర్ 17 బాలుర విభాగంలో ప్రథమ స్థానం జడ్పీఎస్ఎస్ చెల్పూర్, జెడ్పిహెచ్ఎస్ బోర్నపల్లి ద్వితీయ స్థానం పొందింది. ఈ కార్యక్రమంలో ఎస్ జిఎఫ్ గౌరవాధ్యక్షులు, రిటైర్డ్ పిడి సొల్లు సారయ్య, ఎస్ జిఎఫ్ కార్యదర్శి చిరుత శ్రీనివాస్, మండలంలోని వ్యాయామ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు క్రీడాకారులు పాల్గొన్నారు.

క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్నా అతిథులు…

Oplus_16908288

విజేతలైన క్రీడాకారులతో అతిథులు పీటీలు….

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!