Social 1080×1350 • Multi-page
06-09-2025 BREAKING NEWS 08:52 PM
swarnodayam.com
Telugu Daily News

జాతీయ మాలమహానాడు హుజురాబాద్ అసెంబ్లీ నియోజవర్గ ఇంచార్జీగా శ్రీనివాస్ నియామకం

జాతీయ మాలమహానాడు హుజురాబాద్ అసెంబ్లీ నియోజవర్గ ఇంచార్జీగా శ్రీనివాస్ నియామకం
IMG-20250906-WA0088

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: జాతీయ మాలమహానాడు తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ అసెంబ్లీ మాలమహానాడు ఇంచార్జీగా హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని ముక్కపల్లికి చెందిన జూపాక శ్రీనివాస్ ను రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ఆదేశాలను అనుసరించి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కాడే శంకర్ నియామకం చేయడం జరిగింది. నూతనంగా నియమించిన ఇంచార్జి బాధ్యులు వారి నియోజకవర్గ ఎమ్మల్యే క్యాంపు కార్యాలయ ముట్టడిని ఈ నెల 08న, ఉదయం 9గంటలకు రాష్ట్ర కమిటి పిలిపు మేరకు క్యాంపు కార్యాలయ ముట్టడి కార్యక్రమం విజయవంతం చేయుటకు మాలలు పెద్దయెత్తున పాల్గొనుటకు కృషి చేయాలని కోరుతూ పిలుపునిచ్చారు. అలాగే జిల్లాలోని పలు నియోజకవర్గ ఇన్చార్జిల నియామకం ఈ విధంగా ఉంది.
నియోజకవర్గం ఇంచార్జులుగా కరీంనగర్ కు ఇరుకుల్ల యదగిరి,
చొప్పదండి కి కునమల్ల చంద్రయ్య, మానకొండూర్ కు లింగం కుమార్, హుజురాబాద్ కు జూపాక శ్రీనివాస్ లను నియమించామన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కాడే శంకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలుక ఆంజనేయులు, జిల్లా నాయకుడు దామెర సత్యం, బొల్లం వెంకటస్వామి, పల్నాటి చంద్రయ్య, రామచంద్రం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు.

జాతీయ మాలమహానాడు హుజురాబాద్ అసెంబ్లీ నియోజవర్గ ఇంచార్జీగా నియామకమైన జూపాక శ్రీనివాస్..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!