06-09-2025 NORMAL NEWS 10:48 PM
swarnodayam.com
Telugu Daily News
06-09-2025 10:48 PM By Mandala Yadagiri

హుజురాబాద్ లో రెండో రోజు కొనసాగిన నిమజ్జనం వేడుకలు

హుజురాబాద్ లో రెండో రోజు కొనసాగిన నిమజ్జనం వేడుకలు
IMG-20250906-WA0127

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపల్ పరిధిలో రెండవ రోజు శనివారం కూడా గణేష్ నిమజ్జనం వేడుకలు కొనసాగాయి. శుక్రవారం సుమారు 100కు పైగా విగ్రహాలు నిమజ్జనం కాగా రెండవ రోజు పట్టణంలోని హనుమాన్ దేవాలయం వద్ద హనుమాన్ యువసేన యూత్ ప్రతిష్టించిన భారీ విగ్రహంతో పాటు సాయిబాబా ఆలయం వద్ద ఏర్పాటుచేసిన మరో భారీ విగ్రహాన్ని శనివారం నాడే పట్టణంలో ఊరేగించి నిమజ్జనం చేశారు. అయితే హనుమాన్ యువసేన యూత్ నవరాత్రులలో భాగంగా ప్రత్యేక లక్కీ డ్రా నిర్వహించారు. ఇందులో మొదటి బహుమతి మెరుగు శ్రీనివాస్ (ఆరోక్యా పాలు) వాషింగ్ మిషన్ గెలుచుకోగా రెండవ బహుమతి మీ పద్మ లడ్డును గెలుచుకున్నారు అలాగే మూడవ బహుమతిగా వెండి వినాయక విగ్రహాన్ని కోడూరి సహన్ తేజ గెలుచుకున్నారు. హనుమాన్ యువసేన యూత్ నాయకులు విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ యూత్ నెలకొల్పిన విగ్రహం వద్ద నిన్న నిర్వహించిన లడ్డువేలం పాటలో ముస్లిం యువకుడు ఆలీం లడ్డును రూ.10,116 దక్కించుకోవడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది విధితమే. మున్సిపల్ కమిషనర్ కే సమ్మయ్య ఆధ్వర్యంలో భారీ క్రేన్ ను ఏర్పాటు చేయగా రెండవ రోజు కూడా సుమారు ఐదారు భారీ విగ్రహాలను కరీంనగర్ రోడ్ లోని ఎస్సారెస్పీ కెనాల్ వద్ద నిమజ్జనం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టౌన్ సిఐ కరుణాకర్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

మొదటి బహుమతి గెలుపొందిన మెరుగు శ్రీనివాస్ (ఆరోక్యా పాలు) వాషింగ్ మిషన్ గెలుపొందగా వాషింగ్ మిషన్ అందజేసి శాలువాతో సత్కరిస్తున్న నిర్వాహకులు…

మూడవ బహుమతిగా వెండి వినాయక విగ్రహాన్ని కోడూరి సహన్ తేజ కు అందజేస్తున్న నిర్వాహకులు
Oplus_16908288

రెండో రోజు పట్టణంలో కొనసాగుతున్న గణపతి నిమర్జనం వేడుకలు…

Oplus_16908288

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!