Social 1080×1350 • Multi-page
07-09-2025 BREAKING NEWS 10:51 AM
swarnodayam.com
Telugu Daily News

భక్తిశ్రద్ధలతో జమ్మికుంట మజీదే దారులు సలాం ముఫ్తీ (మౌలానా) ఆమీర్ బాబా ఆధ్వర్యంలో మీలాదున్ -నబీ వేడుకలు…

భక్తిశ్రద్ధలతో జమ్మికుంట మజీదే దారులు సలాం ముఫ్తీ (మౌలానా) ఆమీర్ బాబా ఆధ్వర్యంలో మీలాదున్ -నబీ వేడుకలు…
IMG_20250907_104838

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (జమ్మికుంట): ముస్లీములు సంప్రాదాయబద్దంగా మిలాదున్ నబిని వేడుకలను జమ్మికుంట పట్టణంలోని మజీదే దారుల్ సలాం శనివారం రోజున జరుపుకున్నారు. ముస్లిం మత గురువు ముఫ్తీ మౌలానా అమీర్ బాబా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దారుల్ సలాం మజీద్ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ హాజీ ఉపాధ్యక్షులు సలీం ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ హాజీ భాయ్ మాట్లాడుతూ మానవాళిని వక్రమార్గం నుండి సన్మార్గం వైపు నడిపించడానికి అల్లాహ్ ఆయా కాలాలలో ఆయా ప్రాంతాలలో లక్షకు పైగా ప్రవక్తలను అవతరింపచేశాడన్నది ఇమాన్ (విశ్వాసం) గల ప్రతి ముసల్మాన్ విశ్వాసం. కాని ప్రళయాంతం వరకు మానవాళికి సన్మా ర్గం చూపడానికి అల్లాహ్ అనుజ్ఞను శిరసావహించి విధేయులుగా జీవించే మార్గాన్ని భోదించడానికి అల్లాహ్ పంపిన అంతిమ ప్రవక్త మహ్మద్ ప్రవక్త(సల్లల్లాహ్ అలైహివసల్లం). ఇస్లాం బోధనలు ఆచరణీయం, సర్వదా ఆమోదయోగ్యం, మానవాళి మనుగడకు మహోన్నత జీవనవిధానం బోధించిన మహ్మద్ ప్రవక్త(సల్లల్లాహ్ అలైహివసల్లం) జన్మదిన వేడుకలే మిలాదున్ నబి సంబరాలు అని చెప్పినారు.
ఈ కార్యక్రమంలో దారుల్ సలాం మజీద్ కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ హాజీ భాయ్, ఉపాధ్యక్షులు సలీం, మత పెద్దలు ఆజమ్ అలీ, ఇమామ్ అలీ, వహీద్ భాయ్, ఇస్మాయిల్ భాయ్, అసద్ భాయ్, సలీం భాయ్ మౌజన్, ఖలీల్ భాయ్, బషీర్, శేరు భాయ్, యువకులు అలీ బాబా, షాదబ్,అఫె బాబా, సైఫీ, పర్వేజ్, ఆమీర్ బాబా, అఫ్రోజ్, తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న ముస్లిం మత గురువు ముఫ్తీ మౌలానా అమీర్ బాబా…

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!