Social 1080×1350 • Multi-page
07-09-2025 BREAKING NEWS 10:03 PM
swarnodayam.com
Telugu Daily News

రక్తదానంతో ప్రాణదానం చేసిన యువకుడు..

రక్తదానంతో ప్రాణదానం చేసిన యువకుడు..
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఆపదలో ఉన్న ఒక ప్రాణాన్ని తన రక్తం ఇచ్చి కాపాడేందుకు హుజురాబాద్ లోని ఒక యువకుడు ముందుకు వచ్చాడు. వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట్ జిల్లా హుస్నాబాద్ మండలంలోని మడద గ్రామానికి చెందిన బండారి దివ్య అనే యువతికి డెంగీ జ్వరంతో రక్తకణాలు తగ్గి పదివేలకు పడిపోయాయి. డాక్టర్లు వెంటనే ఆమెకు ప్లేట్లెట్స్ ఎక్కించాలని బంధువులకు సూచించారు. దివ్యకు ఏ పాజిటివ్ డోనర్ అవసరం కాగా దివ్య బంధువులు ప్రముఖ సామాజికవేత్త, సాఫ్ట్వేర్ కంపెనీ సీఈవో సబ్బని వెంకట్ ఏర్పాటు చేసిన ఒక బ్లడ్ గ్రూపులో వివరాలు పోస్ట్ చేయగా హుజురాబాద్ కు చెందిన ఉమ్మడి రాము అనే యువకుడు స్పందించాడు. వెంటనే వాట్సప్ పోస్ట్ లో ఉన్న నెంబర్కు ఫోన్ చేసి కరీంనగర్ లోని చల్మెడ ఆనందరావు ఆసుపత్రికి వెళ్లి ప్లేట్లెట్స్(రక్తం) డొనేట్ చేశాడు. ప్రమాదంలో ఉన్న ఆ యువతికి రక్తదానంతో రాము ప్రాణదాతగా మారారు. రాముతో పాటు బ్లడ్ గ్రూప్ ఏర్పాటుచేసిన సబ్బని వెంకట్ కు దివ్య కుటుంబ సభ్యులతో పాటు పలువురు అభినందనలు తెలిపారు.

రక్తదానం చేస్తున్న రాము..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!