07-09-2025 NORMAL NEWS 10:49 PM
swarnodayam.com
Telugu Daily News
07-09-2025 10:49 PM By Mandala Yadagiri

అలరించిన బాలమిత్ర గణపతి భక్తుల విహారయాత్ర..

అలరించిన బాలమిత్ర గణపతి భక్తుల విహారయాత్ర..
IMG-20250907-WA0122

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ పట్టణంలోని విద్యానగర్ లో గల బాలమిత్ర గణపతి భక్త జనబృందం, మండప నిర్వాహకులు, కాలనీవాసులు, పిల్లలు, పెద్దలు అంతా కలిసి ఆదివారం స్థానిక రంగనాయకుల గుట్ట వద్ద వన భోజన విహారయాత్రను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. సామూహిక భోజనాలు చేసి స్వీట్లు పంచుకున్నారు. పిల్లలు, పెద్దలు మ్యూజికల్ చైర్స్, మహిళలు కోలాటం డాన్సులు చేశారు. ఆటల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి కుటుంబానికి బహుమతులు ప్రధానం చేశారు. అలాగే గణపతి నవరాత్రులలో పురోహితునిగా పనిచేసిన ముషం హరికృష్ణను భక్తమండలి ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యానగర్ పెద్దలు, బాలమిత్ర గణపతి మండలి నిర్వాహకులు, మహిళలు, యువతులు, పిల్లలు పాల్గొన్నారు.

Oplus_16908288

బాలమిత్ర గణపతి భక్తుల విహారయాత్ర దృశ్యాలు…

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!