Social 1080×1350 • Multi-page
09-09-2025 BREAKING NEWS 05:44 PM
swarnodayam.com
Telugu Daily News

సిబ్బంది కుటుంబానికి నాగార్జున డైరీ ఎండి ఆర్థిక చేయూత..

సిబ్బంది కుటుంబానికి నాగార్జున డైరీ ఎండి ఆర్థిక చేయూత..
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లి గ్రామ సమీపంలోని నాగార్జున డైరీలో పాల వాహనం నడుపుతూ ఇటీవల విద్యుత్ షాక్ తో ప్రమాదవశాత్తు మృతి చెందిన శంకరపట్నం మండలం వంకాయగూడెం గ్రామానికి చెందిన మూల రాకేష్ కుమార్తె అయిన మూల శాన్వి పేరున నాగార్జున డైరీ యాజమాన్యం రూ. 1,50,000 రూపాయలు తాడికల్ పోస్ట్ ఆఫీస్ లో ఫిక్స్ డిపాజిట్ చేసి ఇవ్వడం జరిగింది. డైరీ సిబ్బందిని అన్ని విధాల ఆదుకునేందుకు తమ యజమాన్యం కృషి చేస్తుందని, సిబ్బంది ఉన్నా లేకున్నా కుటుంబాన్ని ఆదుకునేందుకు ఎల్లవేళల తాము సిద్ధంగా ఉన్నామని డైరీ యజమాన్యం ఈ కార్యక్రమం ద్వారా రుజువు చేసిందన్నారు. ఇట్టి పత్రాలను స్వీకరించినా అతని భార్య లావణ్య ఆమె తల్లిదండ్రులు, రాకేష్ తల్లిదండ్రులు కన్నీటి పర్యాంతంతో మేనేజింగ్ డైరెక్టర్ పుల్లూరి ప్రభాకర్ రావుకి మరియు అందుకు కృషి చేసిన ఏజీఎం ఆకునూరి సుధాకర్, సిసిఎం మల్లారెడ్డి, సూపర్వైజర్ నరేష్ లకు కృతజ్ఞతలు తెలిపారు.

మూల రాకేష్ కుటుంబానికి ఫిక్స్ డిపాజిట్ మేనేజింగ్ డైరెక్టర్ పుల్లూరి ప్రభాకర్ రావు తరపున అందజేస్తున్న ఏజీఎం ఆకునూరి సుధాకర్, సిసిఎం మల్లారెడ్డి, సూపర్వైజర్ నరేష్ లు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!