Social 1080×1350 • Multi-page
09-09-2025 BREAKING NEWS 07:13 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ లో పలు చోట్ల ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు

హుజురాబాద్ లో పలు చోట్ల ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు
IMG-20250909-WA0064

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ వైతాళికుడు కవి కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకొని తెలంగాణ భాషా దినోత్సవం వేడుకలు హుజురాబాద్ లో పలు ప్రభుత్వ కార్యాలయాల్లో, విద్యాసంస్థల్లో ఘనంగా జరిగాయి. హుజురాబాద్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో, తాసిల్దార్ కార్యాలయంతో పాటు పలు కార్యాలయాల్లో, ప్రభుత్వ జూనియర్ కళాశాల, న్యూ శాతవాహన హైస్కూల్ తోపాటు పలు విద్యాసంస్థల్లో కాళోజి జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ పోరాటానికి కాళోజి చేసిన పునాది గురించి, ఆయన కవితల గురించి తెలంగాణ ఉద్యమాన్ని పెంచడానికి ఆయన చేసిన సేవలు గురించి పలువురు స్మరించుకున్నారు. కాలోజీ మార్గాన నేటి యువత నడవాలని ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్య, మేనేజర్ భూపాల్ రెడ్డి, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఆంజనేయరావు, ఏఈ సుధాకర్, సానిటరీ ఇన్స్పెక్టర్ డి కిరణ్, డిపిఓ అశ్విని గాంధీ, కరస్పాండెంట్ వెంకటేశ్వర్లు, కిరణ్ కుమార్, వనమాల మురళీమోహన్, రాజశేఖర్, వాసుదేవరావు, తులసీదాస్, విజయేందర్ రెడ్డి, వెంకటరమణ, పున్నం చందర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ కార్యాలయంలో కాళోజి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న కమిషనర్ సమ్మయ్య, సిబ్బంది..

Oplus_16908288

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాళోజి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న ప్రిన్సిపల్ ఆంజనేయరావు, అధ్యాపకులు, విద్యార్థులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!