Social 1080×1350 • Multi-page
11-09-2025 BREAKING NEWS 11:20 PM
swarnodayam.com
Telugu Daily News

హుజూరాబాద్ టౌన్ లో భారీ వర్షం.. నీట మునిగిన దుకాణాలు… ఇళ్లలోకి చేరిన వరద నీరు.. జలమయమైన లోతట్టు ప్రాంతాలు

హుజూరాబాద్ టౌన్ లో భారీ వర్షం.. నీట మునిగిన దుకాణాలు… ఇళ్లలోకి చేరిన వరద నీరు.. జలమయమైన లోతట్టు ప్రాంతాలు
IMG_20250911_230727

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: అల్పపీడన ప్రభావంతో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంతో పాటు మండల వ్యాప్తంగా గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోగా పట్టణమంతా అంధకారం నెలకొంది. ఇవాళ వారసంత (గురువారం)కావటం వల్ల మార్కెట్లో అమ్మకందారులు, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బుందులు ఎదుర్కొన్నారు. పట్టణంలోనీ బుడుగ జంగాల కాలనీ, గణేష్ నగర్, ఇల్లందులవాడ, మామిళ్ళవాడ, గాంధీనగర్, కాకతీయ కాలనీ, ఇందిరా నగర్, కొత్తపల్లి, ముక్కపల్లి, బోర్ణపల్లి, థమక్కపేట, నర్సింగాపూర్ రోడ్లన్నీ జలమయం కావడంతో పలువురి ఇళ్లలోకి నీళ్లు చేరాయి. డీసీఎంఎస్ కాంప్లెక్స్ లో పలు దుకాణాలు నీట మునిగాయి. నీట మునిగిన రహదారులపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సుమారు 4-5 గంటల పాటు కురిసిన వర్షంతో పట్టణ మొత్తం జలమయంగా మారిపోవడం పలువురిని విస్మయానికి గురిచేసింది. అధికారులు పాలకులు నిర్లక్ష్యం మూలంగానే లోతట్టు ప్రాంతాలు చిన్నపాటి వర్షాలకు సైతం నీటమునుగుతున్నాయని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

డీసీఎంఎస్ కాంప్లెక్స్ లో పలు దుకాణాలు నీట మునిగాయి..

డీసీఎంఎస్ కాంప్లెక్స్ లో పలు దుకాణాలు నీట మునిగాయి..

Oplus_16908288

నీటీతో నిండిన హైస్కూల్ గ్రౌండ్….

Oplus_16908288

పారుతున్న చిలుక వాగు…

సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షం….
Oplus_16908288

జలమయమైన ప్రధాన రహదారులు….

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!