Social 1080×1350 • Multi-page
12-09-2025 BREAKING NEWS 06:53 PM
swarnodayam.com
Telugu Daily News

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ప్రణవ్.. – పలు కాలనీలను సందర్శించిన పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ.. – వరదలపై జిల్లా అధికారులు, హుజూరాబాద్, జమ్మికుంట కమిషనర్లతో మాట్లాడిన ప్రణవ్.

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ప్రణవ్.. – పలు కాలనీలను సందర్శించిన పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ.. – వరదలపై జిల్లా అధికారులు, హుజూరాబాద్, జమ్మికుంట కమిషనర్లతో మాట్లాడిన ప్రణవ్.
IMG-20250912-WA0100

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని పలు కాలనీల్లో వరద చుట్టు ముట్టిందని, దానికి తగ్గట్టుగా శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని, త్వరలోనే హుజూరాబాద్ నాలాలపై మాస్టర్ ప్లాన్ తయారుచేసి పరిష్కారానికి కృషి చేస్తామని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ అన్నారు. శుక్రవారం ఉదయం నుండే గాంధీనగర్, బుడగజంగాల కాలనీ, మామిండ్లవాడ, గ్యాస్ గోదాం ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఆయన పర్యటించారు. ప్రాంతాల్లో పర్యటిస్తున్న క్రమంలో పలువురు వార్డుల్లో నెలకొన్న సమస్యలను దృష్టికి తీసుకురాగా, వాటిని అధికారులతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తానని, వరద సమస్యపై శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలను సిద్ధం చేసేలా కలెక్టర్ తో మాట్లాడామని అన్నారు. గురువారం రాత్రి నుండే అధికారులకు సూచనలు చేశామని, ముందస్తు చర్యలో భాగంగా ఓ ఫంక్షన్ హాల్ లో లోతట్టు ప్రాంతాలవారిని తరలించే విధంగా సమాయత్తం చేసేలా అధికారులను, కాంగ్రెస్ పార్టీ నాయకులను కోరామని అన్నారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ కమిషనర్ కే సమ్మయ్య, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ముంపు ప్రాంతాలను పరిశీలించి తక్షణ చర్యలు చేపడుతున్న అధికారులను ఆదేశిస్తున్న కాంగ్రెస్ నేత ప్రణవ్…

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!