Social 1080×1350 • Multi-page
12-09-2025 BREAKING NEWS 07:49 PM
swarnodayam.com
Telugu Daily News

సద్దుల బతుకమ్మ దసరా ఘనంగా నిర్వహించాలి…వర్షాలపై తగు జాగ్రత్తలు తీసుకోవాలి, నష్టం అంచనా వేయాలి.. – రివ్యూ మీటింగ్ లో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

సద్దుల బతుకమ్మ దసరా ఘనంగా నిర్వహించాలి…వర్షాలపై తగు జాగ్రత్తలు తీసుకోవాలి, నష్టం అంచనా వేయాలి.. – రివ్యూ మీటింగ్ లో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
IMG-20250912-WA0125

– హుజురాబాద్ లో కోతుల నివారణకు చర్యలు చేపట్టాలి

– అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులు నిష్పక్షపాతంగా చేయాలి

– రివ్యూ మీటింగ్ లో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

,మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రాబోయే సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాలను హుజురాబాద్లో ఘనంగా నిర్వహించాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం హుజురాబాద్ లోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన రివ్యూ మీటింగ్లో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఆడపడుచులకు పెద్ద పండుగ అయినా సద్దుల బతుకమ్మను ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు దగ్గర ఉండి పనులను పర్యవేక్షించి ఘనంగా జరిగేలా చూడాలని అన్నారు. బతుకమ్మ కేంద్రాల వద్ద మహిళలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. కనివిని ఎరగని రీతిలో దసరా పండుగ నిర్వహించాలని అన్నారు. అలాగే పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్ళను కేటాయించాలని, అర్హులైన వారందరికీ నిష్పక్షపాతంగా కేటాయింపులు జరగాలని అన్నారు. హుజురాబాద్ లో విపరీతంగా కోతుల బెడద ఉందని, గతంలో కోతుల వల్ల చాలామంది ఇబ్బందికి గురైన సంఘటనలతో పాటు ఒక వ్యక్తి మరణించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. కోతుల బెడదను నివారించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని అన్నారు. గురువారం రాత్రి కురిసిన వర్షాలతో జరిగిన విపత్తులో ఆస్తి నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను సూచించారు. వర్షాల వల్ల ఇబ్బందులను ఎదుర్కొన్న కుటుంబాల వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలన్నారు. హుజరాబాద్ లో తిరిగి వర్షాలు పడే అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి ప్రకృతి విపత్తునైనా ఎదుర్కొనేలా ఉండాలని, లోతట్టు ప్రాంతాలలో అధికారులు నిత్యం పర్యవేక్షణ జరపాలని అన్నారు. వర్షాలపై ఎప్పటికప్పుడు తనకు సమాచారం అందించాలని అన్నారు. ప్రజలకు ఎలాంటి హాని కలవకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదేనని అన్నారు. ఈ రివ్యూ మీటింగ్ లో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తో పాటు అధికారులు పాల్గొన్నారు.

Oplus_16908288
అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి…
Oplus_16908288
Oplus_16908288

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!