13-09-2025 NORMAL NEWS 09:47 PM
swarnodayam.com
Telugu Daily News
13-09-2025 09:47 PM By Mandala Yadagiri

ఆస్తి వివాదాన్ని పరిష్కరించాలని పురుగుల మందు డబ్బాతో ఓ వ్యక్తి ఆందోళన.. – పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన గొడవ.

ఆస్తి వివాదాన్ని పరిష్కరించాలని పురుగుల మందు డబ్బాతో ఓ వ్యక్తి ఆందోళన.. – పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన గొడవ.
1004054262

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఉమ్మడి ఆస్తిలో తన వాటా డబ్బులు ఇవ్వకుండా సోదరులు తనని ఇబ్బంది పెడుతున్నారని తనకు డబ్బులు ఇవ్వకుంటే ఆత్మహత్య శరణ్యమని శనివారం హుజురాబాద్ పట్టణంలో పురుగుల మందు డబ్బాతో దాసరి సదానందం అనే వ్యక్తి ఆందోళన చేపట్టాడు. సదానందం ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు ఆయనను ఆత్మహత్య చేసుకోకుండా అడ్డుకొని సోదరుల నుండి డబ్బు ఇప్పిస్తామని నచ్చ చెప్పి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా సదానందం మాట్లాడుతూ.. తనకు దాసరి రాజయ్య, సుదర్శన్ లు తనకు సొంత సోదరులని, ఉమ్మడి ఆస్తి విక్రయించగా తనకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, తన కూతురు వివాహం ఉన్నందున తన డబ్బులు ఇవ్వమంటే తన అన్నదమ్ములు ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. దీంతో తాను పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డట్టు ఆయన తెలిపారు. కాగా పోలీసులు ముగ్గురు అన్నదమ్ములను స్టేషన్కు పిలిపించి సమస్య పరిష్కారం చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

పురుగుల మందు డబ్బాతో అన్న ఇంటి ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న తమ్ముడు సదానందం

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!