Social 1080×1350 • Multi-page
14-09-2025 BREAKING NEWS 07:18 PM
swarnodayam.com
Telugu Daily News

తత్వవేత్త బ్రహ్మశ్రీ ఆధ్యాత్మిక గురువు డాక్టర్ సత్యంగౌడ్ కు జాతీయస్థాయి విశ్వ గురువు ప్రధానం.

తత్వవేత్త బ్రహ్మశ్రీ ఆధ్యాత్మిక గురువు డాక్టర్ సత్యంగౌడ్ కు జాతీయస్థాయి విశ్వ గురువు ప్రధానం.
IMG-20250914-WA0049

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ కవి, రచయిత, మానవ విలువల పరిరక్షణ జాతీయ అధ్యక్షులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు, తత్వవేత్త, బ్రహ్మశ్రీ డాక్టర్ నాగుల సత్యం గౌడ్ కు తెలుగు ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ మరియు శ్రీ విరాట్ విశ్వకర్మ విజ్ఞాన ఆధ్యాత్మిక ధార్మిక కళా పరిషత్ జాతీయ సంస్థల పక్షాన శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం 2025 సంవత్సరమును పురస్కరించుకొని అందజేశారు. సత్యం గౌడ్ సామాజిక, ఆధ్యాత్మిక సేవలు, మరియు సమాజానికి ఉపయోగపడే రచనలు రానీస్తూ మానవత విలువలు పెంపొందించే దిశగా బోధనలు సెమినార్లు ఇస్తున్న వీరి విశిష్ట గుర్తించి వీరిని…విశ్వ గురువు జాతీయ పురస్కారానికి ఎంపిక చేసి, ఈ యొక్క పురస్కారాన్ని హుస్నాబాద్ మండల కేంద్రం నాగారం రోడ్డునీ శ్రీ రాజ్యలక్ష్మి కాన్వెంట్స్ హాల్లో ముఖ్య అతిథులుగా వచ్చిన నాయకులు, వివిధ స్వచ్ఛంద సేవ సంస్థల వ్యవస్థాపకుల అధ్యక్షుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సంస్థల వ్యవస్థాపకులు ప్రముఖులు, సిద్దిపేట గ్రంధాలయ చైర్మన్ లింగమూర్తి, బ్రహ్మశ్రీ డాక్టర్ కాళీ జగన్నాథం, చేల్లేటి కృష్ణమాచార్యులు, జగన్నాథం, అధ్యక్షులు, కౌన్సిలర్ జ్యోతి, కడెం లింగయ్య, విశ్వ కళ విరాట్ బ్రహ్మశ్రీ వంగల శాంతి కృష్ణ ఆచార్యులు, విశ్వకర్మ రాష్ట్ర సంఘం అధ్యక్షులు కార్యకర్త సభ్యులు, ఈ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షులు విశ్వ విరాట్ కళ రత్న బ్రహ్మశ్రీ పోలోజ్ రాజ్ కుమార్, పాడిశెట్టి విష్ణువర్ధనాచార్యులు గురూజీ వీరధర్మరాజు స్వామి చింతగుట్ట పీఠాధిపతి, పాడిశెట్టి విష్ణువర్ధన్ ఆచార్యులు, శ్రీనివాసచార్యులు, చింతగట్టు పీఠాధిపతి గురూజీ వీర ధర్మరాజస్వామి, భాస్కరాచార్యులు, వెంపటి శ్రావణి, నారాయణదాసు జ్యోతి, పోలోజు భాస్కరాచార్యులు ముఖ్య అతిథులు, ప్రముఖులు మాట్లాడుతూ…సత్యముగౌడ్ సామాజిక రచనలు వారి ఆధ్యాత్మిక బోధనలు, సమాజానికి ఉపయోగపడే రచనలు రాణిస్తూ, ఎందరో విద్యార్థులకు మోటివేషన్ చేస్తూ, ప్రతి విద్యార్థి ప్రయోజకుడుగా ఎదగడానికి తన వంతు సెమినార్ల ద్వారా కృషి చేస్తూ, విద్యార్థుల ప్రయోజనాన్ని కోరుకుంటూ నిస్వార్ధంగా సేవలు అందిస్తున్న సత్యంగౌడ్ విశిష్ట సేవలను ప్రముఖులు కొనియాడారు. అనంతరం తత్వవేత్త ఆధ్యాత్మిక గురువు బ్రహ్మశ్రీ డాక్టర్ సత్యంగౌడ్ మాట్లాడుతూ….ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకొని సమాజసేవలో భాగస్వాములై, నవభారత నిర్మాణానికి పునాదిగా నిలవాలన్నారు. అంటరాని స్వర్గాన్ని వదులుకొని, నిత్యజీవితంలో నిత్యం సత్యం పలుకుతూ, మనస్సాక్షిగా మెదులుతూ ఎవరికీ హాని కలిగించక జీవిస్తూ, ఈ మానవ జన్మను సార్ధకం చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతను అలవర్చుకొని, మనసును ప్రశాంతత పరుచుకొని, ప్రశాంతమైన జీవితాన్ని గడపాలన్నారు. ఈ కార్యక్రమంలో కవులు, రచయితలు, కళాకారులు, విద్యావేత్తలు, డాక్టర్లు, వివిధ సంఘాల, స్వచ్ఛంద సంస్థల అధ్యక్షులు, వ్యవస్థాపకులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం గౌడ్ ను సన్మానిస్తున్న ముఖ్య అతిథులు… మాట్లాడుతున్న ప్రజా కవి సత్యముగౌడ్..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!