Social 1080×1350 • Multi-page
14-09-2025 BREAKING NEWS 07:40 PM
swarnodayam.com
Telugu Daily News

విప్లవ వీరుల కన్నతల్లి గోపగోని కొమురమ్మ సంస్మరణ సభ.

విప్లవ వీరుల కన్నతల్లి గోపగోని కొమురమ్మ సంస్మరణ సభ.
IMG-20250914-WA0053

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:


వీరులకన్న తల్లి గోపగోని కొమురమ్మ సంస్మరణ సభ ఆదివారం నాడు హుజూరాబాద్ మండలంలోని తుమ్మనపల్లి గ్రామంలో ఘనంగా జరిగింది. నక్సలైట్ నాయకులు గోపగోని ఐలన్న@మహేష్, గోపగోని కుమారస్వామి@రవన్న ల తల్లి గోపగోని కొమురమ్మ ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే.
కుటుంబ సభ్యులు,బంధు మిత్రులు సంయుక్తంగా నిర్వహించిన సంస్మరణ సభకు సైదాపూర్ మాజీ ఎం.పి.పి అధ్యక్షులు, సామాజిక ఉద్యమకారుడు పొడిశెట్టి వెంకటరాజం అధ్యక్షత వహించారు. సంస్మరణ సభలో పలువురు వక్తలు ప్రసంగిస్తూ కొమురమ్మతో పాటు ప్రజాయుద్ధంలో అమరులైన గోపగోని ఐలన్న,కుమారస్వామి లతో కొనసాగిన తమ ఉద్యమ నేపత్యాన్ని నెమరువేసుకున్నారు.ఆ వీరుల ఆశయ సాధనలో ముందుకు నడుద్దామని పిలుపునిచ్చారు.
గోపగోని కొమురమ్మకు స్వయాన చెల్లెలు కుమారుడైన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మోడెం బాలకృష్ణ నాలుగు రోజుల క్రితం ఎన్ కౌంటర్ అయి, ఇదే రోజు హైదరాబాద్ లో అంత్యక్రియలు జరుగుతున్న నేపథ్యంలో సంస్మరణ సభకు హాజరైన ప్రజలు ఆయనకు నివాళులు అర్పిస్తూ, మోడెం బాలకృష్ణ అమర్ రహే అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు.
సభలో ప్రముఖ న్యాయవాది ముక్కెర రాజు, హుజూరాబాద్
జనసాహితి కన్వీనర్ ఆవునూరి సమ్మయ్య, భారత నాస్తిక సంఘం జాతీయ నాయకులు జీడీ సారయ్య,ప్రజా సంఘాల నాయకులు భీమోజు సదానందం, గాలేబు ఆగయ్య, మిడ్దొడ్డి శ్రీనివాస్
బత్తుల సిద్దేశ్వర్, చామర్తి గాడ్గే బాబా, గోపు మహేందర్ రెడ్డి, రషీద్
రాజమౌళి(గోదావరిఖని) సుధాకర్(వరంగల్), ఆగిరెడ్డ, సత్తిరెడ్డి, కేశవులు, బుచ్చయ్య, పంజాల రాజకుమారి, భీమోజు జయక్క, పొడిశెట్టి సుమతి, గోపగోని కొమురమ్మ కుమారులు గోపగోని లింగన్న, రాజమౌళి, సమ్మయ్య,కూతురు పద్మ, తుమ్మనపల్లి గ్రామ మాజీ సర్పంచ్ భాస్కర్ తదితరులు ప్రసంగించారు.
భారీ సంఖ్యలో హాజరైన సభలో ప్రజాగాయకులు జీడి సారయ్య, ముక్కెర రాజు, మహమ్మద్ రషీద్, పంజాల రాజకుమారి తదితరులు పాడిన అమరులను స్మరిస్తూ పాడిన గీతాలు పలువురుని కంట తడిపెట్టించాయి.

గోపగోని కొమరమ్మకు నివాళులర్పిస్తున్న పలువురు ప్రముఖులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!