Social 1080×1350 • Multi-page
15-09-2025 BREAKING NEWS 08:31 PM
swarnodayam.com
Telugu Daily News

ఆర్టీసీ యాత్ర దానం కోసం దాతలు ముందుకు రావాలి.. – డిఎం రవీంద్రనాథ్

ఆర్టీసీ యాత్ర దానం కోసం దాతలు ముందుకు రావాలి.. – డిఎం రవీంద్రనాథ్
IMG-20250915-WA0081

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పేదల కోసం విద్యార్థుల కోసం యాత్రలను పంపించడానికి యాత్రా దానం పథకం కోసం దాతలు ముందుకు రావాలని హుజురాబాద్ ఆర్టీసీ డిఎం రవీంద్రనాథ్ అన్నారు. సోమవారం హుజురాబాద్ లో యాత్ర దానం పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణలో ఎవరైనా దాతలు ముందుకు వచ్చి పేదవారికి పుణ్యక్షేత్రాలకు పంపడం గానీ, విద్యార్థులకు విజ్ఞాన యాత్ర కోసం తాము డబ్బులు చెల్లించి పంపడం కానీ చేయడమే ఈ పథకం ఉద్దేశం అని అన్నారు. ఎంతోమంది పేదలు ఇప్పటివరకు ఒక్క యాత్ర కూడా చేయని వారు ఉన్నారని అలాంటి వారికి యాత్ర చేయడానికి బస్సు కు డబ్బులు వ్యాపారవేత్తలు, స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు బీద విద్యార్థులు, ప్రజల కోసం డబ్బులు చెల్లించి బస్సులను రిజర్వ్ చేసుకోవాలన్నారు. బీద వారికి ఉపయోగ పడుతుందనే ఉద్దేశ్యం తో కొత్తగా పథకాన్ని ఆర్టీసీ అధికారులు ప్రవేశ పెట్టారని అన్నారు. 200 కిలో మీటర్ల లోపు ఎక్స్ప్రెస్ బస్సులకు 26,707 రూపాయలు, సూపర్ లగ్జరీ బస్సులకు 29,752 రూపాయలు, డీలక్స్ బస్సులకు 32,587 రూపాయలు, రాజధాని బస్సులకు 43,507 రూపాయలు చెల్లిస్తే వారు చెప్పిన యాత్రకు, విజ్ఞాన యాత్రకు ఆర్టీసీ అధికారులు తీసుకొని వెళ్తారని అన్నారు. దాతలు ముందుకు వచ్చి పేదలకు యాత్రలు చేయడానికి యాత్రా దానం పథకాన్ని ఉపయోగించుకోవాలన్నారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఆర్టీసీ డిపో మేనేజర్ రవీంద్రనాథ్..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!