Social 1080×1350 • Multi-page
15-09-2025 BREAKING NEWS 10:44 PM
swarnodayam.com
Telugu Daily News

లేబర్ కమిషనర్ దృష్టికి ముద్ర ఉదంతం.. – వేతనాలు ఇప్పించాలని డబ్ల్యూజేఐ వినతి

లేబర్ కమిషనర్ దృష్టికి ముద్ర ఉదంతం.. – వేతనాలు ఇప్పించాలని డబ్ల్యూజేఐ వినతి
Oplus_16908288

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: ముద్ర పత్రిక సిబ్బందికి యాజమాన్యం వెంటనే వేతనాలు బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) రాష్ట్ర శాఖ కార్మిక శాఖకు విజ్ఞప్తి చేసింది. సోమవారం లేబర్ కమిషనర్ కార్యాలయంలో సంయుక్త కార్మిక కమిషనర్ సునీత గోపాల్ దాస్ ను ముద్ర సిబ్బందితో కలిసిన యూనియన్ నాయకులు ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. కమిషనర్ ను కలసిన ప్రతినిధి బృందంలో డబ్ల్యూజేఐ రాష్ట్ర అధ్యక్షుడు రాణా ప్రతాప్, ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు అనిల్ దేశాయ్ న్యాలకొండ ఉన్నారు. ముద్ర పత్రిక జర్నలిస్టులు, సిబ్బందితో కలిసి వారు సమస్యను ఆమె దృష్టికి తెచ్చారు. తమకు దాదాపుగా 5 నెలల నుండి 11 నెలల వరకు జీతం బకాయి ఉన్నట్లు బాధితులు తెలిపారు. ఈ విషయమై త్వరలో ముద్ర యాజమాన్యంతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తామని సంయుక్త కార్మిక కమిషనర్ సునీత గోపాల్ దాస్ హామీ ఇచ్చారు.

లేబర్ కమిషనర్ కార్యాలయంలో సంయుక్త కార్మిక కమిషనర్ సునీత గోపాల్ దాస్ కు వినతి పత్రం అందజేస్తున్న ముద్ర సిబ్బంది..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!