Social 1080×1350 • Multi-page
16-09-2025 BREAKING NEWS 11:38 PM
swarnodayam.com
Telugu Daily News

కేవీకే ఆధ్వర్యంలో శాస్త్రవేత్తల క్షేత్ర సందర్శన

కేవీకే ఆధ్వర్యంలో శాస్త్రవేత్తల క్షేత్ర సందర్శన
IMG-20250916-WA0144

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: మంగళవారం రోజున హుజురాబాద్ మండలము సిర్సపల్లి, వెంకట్రావుపల్లి, సింగపూర్ గ్రామాల్లో వరి పొలాలను కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డి శ్రీనివాసరెడ్డి మరియు వ్యవసాయ శాఖ వ్యవసాయ అధికారి భూమిరెడ్డి, మరియు విస్తరణాధికారి సతీష్ మరియు రైతులు వంగల వెంకటరెడ్డి సాయిరాం వరి పంటలను సందర్శించడం జరిగింది . దీనిలో భాగంగా వరిలో ఆకు నల్లి, పాము పొడ తెగులు, దోమపోటు గమనించడం జరిగింది. ఆకునల్లి నివారణకు మార్కెట్లో లభ్యమయ్యే ఒబెరాన్ మందును ఒక మిల్లీ లీటర్/ లీటర్ నీటికి కలిపి దీనితో పాటు టిల్ట్ అనే మందును 1 మిల్లీలీటర్ / లీటర్ వీటికి కలిపి పిచికారి చేయాలన్నారు. పాము పొడ తెగులు నివారణకు కాంటాఫ్ ప్లస్ -2 మిల్లి / లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి లేదా నేటివో మందును -100గ్రా / ఎకరాకు కలిపి పిచికారి చేయాలనీ దోమపోటు నివారణకు చెస్-120గ్రా / ఎకరాకు లేదా పెక్సలాన్ -97 మిల్లి / ఎకరాకు కలిపి పంట పైనుండి కింది వరకు తడిచేలా పిచికారి చేయాలి పైన తెలిపిన మందులను ముందు జాగ్రత్తగా పిచికారి చేస్తే రైతులు పెట్టుబడి తగ్గించి అధిక దిగుబడులు సాధించవచ్చు అని అన్నారు.

క్షేత్ర సందర్శన..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!