17-09-2025 NORMAL NEWS 03:15 PM
swarnodayam.com
Telugu Daily News
17-09-2025 03:15 PM By Mandala Yadagiri

కౌశిక్ రెడ్డికి మానసిక స్థితి బాగోలేదు.. – సీజో ఫెర్నియా అనే మెంటల్ డిసాస్టర్ జబ్బుతో బాధపడుతున్నాడు. – కాంగ్రెస్ నేత ప్రణవ్..

కౌశిక్ రెడ్డికి మానసిక స్థితి బాగోలేదు.. – సీజో ఫెర్నియా అనే మెంటల్ డిసాస్టర్ జబ్బుతో బాధపడుతున్నాడు. – కాంగ్రెస్ నేత ప్రణవ్..
IMG-20250917-WA0033

ఆరోపణలు కాదు,ఆధారాలు ఏవీ?దమ్ముంటే ఆధారాలు చూపెట్టాలి.

నిజాయితీ ఉంటే ముగ్గురు ఎంపీల పేర్లు చెప్పాలి,ఆ ముగ్గురు ఎవరు?

కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే ముందు ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో ఒక్క కమిటీ కూడా ఎందుకు వేయలేదు?

కౌశిక్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడిన ప్రణవ్.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సీజో ఫెర్నియా అనే మానసిక జబ్బుతో బాధపడుతున్నాడని, వెంటనే కౌశిక్ రెడ్డిని దవాఖానలో చూపించాలని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ వారి కుటుంబ సభ్యులను కోరారు. బుధవారం హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రజా పరిపాలన దినోత్సవం భాగంగా జాతీయ జెండాను ఎగురవేసి ఆనాటి రజాకార్ల నుండి పోరాడిన పోరాట యోధులను గుర్తు చేసుకున్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ స్కూల్ పిల్లాడికంటే చిన్నవాడిలాగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నాడని, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కలుస్తామని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పారని, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసే కౌశిక్ రెడ్డి దమ్ముంటే ఆధారాలు చూపెట్టాలని అన్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓటు వేయలేదో చెప్పాలని, ఒక తెలుగువాడిగా ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వాల్సింది పోయి అసలు ఎన్నికకే దూరంగా ఉండి రాజకీయాలు చేయడం చూస్తుంటే బీఆర్ఎస్ నాయకులు ఎంత అక్కసుతో ఉన్నారో అర్థం అవుతుందని పేర్కొన్నారు. అవినీతి గురించి, స్కాంల గురించి బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్, కవితనే చెప్పారని, హుజురాబాద్ లో రెండేళ్లు ఎమ్మెల్సీగా ఉండి ఒక్క కమిటీ వేయకుండా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన కౌశిక్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడడం సిగ్గు చేటని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ, ఆలయాల, పార్టీ కమిటీలను నియమించామని ఇది కౌశిక్ రెడ్డికి మాకు ఉన్న తేడా అని పేర్కొన్నారు. అంతేకాకుండా ఉద్యమ పార్టీగా మొదలెట్టి రాజకీయ పార్టీగా మారిన తర్వాత దేశంలోనే అత్యంత డబ్బు కలిగిన ప్రాంతీయ పార్టీగా ఎలా ఎదిగింది బిఆర్ఎస్ నాయకులు చెప్పాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిగా తెలంగాణ ను దోచుకొని భారత రాష్ట్ర సమితిగా దేశాన్ని దోచుకోవడానికి బయలుదేరితే రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పి ప్రతిపక్షానికి కూర్చోబెడితే పార్లమెంట్ ఎన్నికల్లో ఇంటికే పరిమితం చేశారని అన్నారం. ఇకపై భారత రాష్ట్ర సమితిని బోగస్ రాష్ట్ర సమితిగా నామకరణం చేయాలని అన్నారు. కౌశిక్ రెడ్డి వన్ టైం ఎమ్మెల్యే అని, హుజూరాబాద్ భవిష్యత్ కాంగ్రెస్ పార్టీదేనని, ఆరోపణల కంటే అభివృద్ధిలో పోటీ పడతామని హితవూ పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గములోని ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

జాతీయ జెండా ఆవిష్కరించి సెల్యూట్ చేస్తున్న ప్రణవ్ బాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు..

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!