17-09-2025 NORMAL NEWS 07:20 PM
swarnodayam.com
Telugu Daily News
17-09-2025 07:20 PM By Mandala Yadagiri

ఆల్ఫోర్స్ జీనియస్ లో ముందస్తు బతుకమ్మ సంబరాలు.. – ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నేత ప్రణవ్..

ఆల్ఫోర్స్ జీనియస్ లో ముందస్తు బతుకమ్మ సంబరాలు.. – ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నేత ప్రణవ్..
IMG-20250917-WA0085

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ పట్టణంలోని ఆల్ఫోర్స్ జీనియస్ పాఠశాలలో బుధవారం ముందస్తు బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలకు విచ్చేసిన ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డితో పాటు పాఠశాలకు విచ్చేసిన హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితల ప్రణవ్ బాబుకు పాఠశాల విద్యార్థులు బతుకమ్మలను అందజేసి కోలాటాలతో పూలను జల్లుతూ ఆహ్వానించారు. ఆ తర్వాత ప్రణవ్ బాబుతో కలిసి డాక్టర్ వి నరేందర్ రెడ్డి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ హుజూరాబాద్ ప్రజలకు ముందస్తు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటారని, పూలతో చేసిన బతుకమ్మను పూజించడం మన సంస్కృతిలో ఒక భాగం అని, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఆడపడుచులు బతుకమ్మ పాటలపై ఆడిపాడతారని తెలిపారు. అలాగే హుజూరాబాద్ ప్రజలు చాలా మంచివారని, ప్రతి కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తారని తమ పాఠశాల స్థాపించిన రెండవ సంవత్సరంలోనే 600 అడ్మిషన్లను పొందామని మంచి పాఠశాలను ఆదరిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే పాఠశాలకు విచ్చేసిన ప్రణవ్ బాబు మాట్లాడుతూ ముందస్తు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపి, విద్యార్థులు చిన్నప్పటినుండే కష్టపడి చదవాలని, చిన్న వయసులోనే తమ కెరీర్ ను నిర్దేశించుకొని ముందుకు సాగాలని తెలిపారు. తదనంతరం హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్ బాబు అలాగే విద్యార్థినులు, తల్లిదండ్రులతో కలిసి డాక్టర్ వి నరేందర్ రెడ్డి బతుకమ్మ పాటలపై కోలాటం నృత్యం చేశారు. అలాగే పిలవగానే తమ పాఠశాలకు విచ్చేసిన హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ బాబును అలాగే ఇతర కార్యకర్తలను శారువాలతో ఘనంగా సత్కరించారు. తదనంతరం ఈ మధ్యనే డాక్టర్ వి నరేందర్ రెడ్డి కి అవుట్ స్టాండింగ్ ఎడ్యుకేషనల్ అడ్మినిస్ట్రేటర్ అవార్డు వచ్చినందున నియోజకవర్గ ఇంచార్జ్ ప్రణవ్ బాబు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ కొల్లూరి కిరణ్, టౌన్ ప్రెసిడెంట్ మేకల తిరుపతి, జిల్లా మహిళా వైస్ ప్రెసిడెంట్ లావణ్య, మహిళా టౌన్ ప్రెసిడెంట్ యేముల పుష్పలత, మండల మహిళా ప్రెసిడెంట్ పి రాధా, హనుమాన్ టెంపుల్ చైర్మన్ కొలీపాక శంకర్ తో పాటు కార్యకర్తలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అతిథులకు

బతుకమ్మలు, కోలాటాలతో స్వాగతం పలుకుతున్న ఆల్ఫోర్స్ విద్యార్థులు..

విద్యార్థులతో కలిసి కోలాటాలాడుతున్న ముఖ్య అతిథులు నరేందర్ రెడ్డి, ప్రణవ్..

మాట్లాడుతున్న ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి..

నరేందర్ రెడ్డిని శాలువాతో సత్కరిస్తున్న కాంగ్రెస్ నేత ప్రణవ్..

కాంగ్రెస్ నాయకుడు ప్రణవ్ ను సన్మానిస్తున్న ఆల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి…

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!