19-09-2025 NORMAL NEWS 08:41 PM
swarnodayam.com
Telugu Daily News
19-09-2025 08:41 PM By Mandala Yadagiri

మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి.. ఈనెల 27న యువతులు మహిళలకు చెస్ పోటీలు.

మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి.. ఈనెల 27న యువతులు మహిళలకు చెస్ పోటీలు.
IMG-20250919-WA0077

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: నేటి సమాజంలో బాలికలు, మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని వారిని చైతన్యవంతం చేసేందుకు చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ కే సమ్మయ్య అన్నారు. శుక్రవారం హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలో చెస్ నెట్వర్క్, హుజురాబాద్ మున్సిపాలిటీల సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 27న హుజురాబాద్ లో జరిగే చెస్ పోటీల పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. చెస్ క్రీడతో వల్ల మానసికంగా ఆలోచనపరంగా మనిషి అభివృద్ధి చెందుతాడని అన్నారు. మహిళల పండుగైన బతుకమ్మ పండుగను పురస్కరించుకొని బాలికలను మహిళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కొంతమంది ఎన్నారైలు చెస్ నెట్వర్క్ స్థాపించి చదరంగం క్రీడను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. హుజురాబాద్ మండలంలోని చదరంగ ఆటపై ఆసక్తి కలిగిన బాలికలు మహిళలు తమ పేర్లను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని అన్నారు. మూడు ఏజ్ గ్రూపులో పోటీలు నిర్వహించి ప్రథమ బహుమతి రూ.1500 ద్వితీయ బహుమతి రూ.1000 తృతీయ బహుమతి 500 ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ మల్లారెడ్డి, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఆంజనేయులు, డాక్టర్ సరళ ఝాన్సీరాణి, డాక్టర్ రేణుక, సుమలత, స్వప్న, రమ, ఓదెలు, డాక్టర్ స్వరూపరాణి, తులసీదాస్, విజేందర్ రెడ్డి, మురళీమోహన్, వనమాల, ప్రసాద్, సుగుణ, శైలజ, రాజమణి, రాజశేఖర్, పున్నం చందర్, న్యాయవాది మాధవి, సానిటరీ ఇన్స్పెక్టర్ డి కిరణ్, వినయ్, ఆరేల్లి రమేష్, ప్రతాప రాజు, తూముల కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గోడపత్రికను ఆవిష్కరిస్తున్న కమిషనర్, అధ్యాపకులు, విద్యార్థులు…

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గోడపత్రికను ఆవిష్కరిస్తున్న కమిషనర్, అధ్యాపకులు, విద్యార్థులు..

కార్యక్రమంలో మాట్లాడుతున్న కమిషనర్ సమ్మయ్య.. పక్కన జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఆంజనేయులు, అధ్యాపకులు..

కార్యక్రమంలో మాట్లాడుతున్న న్యాయవాది మాధవి..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!