19-09-2025 NORMAL NEWS 10:48 PM
swarnodayam.com
Telugu Daily News
19-09-2025 10:48 PM By Mandala Yadagiri

హుజురాబాద్ లో వీధి వ్యాపారుల గుర్తింపు సర్వే

హుజురాబాద్ లో వీధి వ్యాపారుల గుర్తింపు సర్వే
IMG-20250919-WA0084

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలో వీధి వ్యాపారం చేసుకుంటూ జీవించే వారిని గుర్తించే సర్వేను మెప్మా నిర్వహిస్తుంది. హుజురాబాద్ మునిసిపాలిటీ పరిధిలో వీధి వ్యాపారం చేసుకునే వారిని ఈ నెల 17 నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు లోక్ కళ్యాణ్ మేళా సర్వే నిర్వహిస్తున్నట్లు మెప్మా సిఎల్ ఆర్ పిలు రమాదేవి స్వరూపలు తెలిపారు. మెప్మా ఆధ్వర్యంలో కరోనా సమయంలో హుజురాబాద్ పట్టణంలోని సుమారు 2000 మంది వీధి వ్యాపారులకు రుణాలు అందించడం జరిగిందని, తిరిగి వీధి వ్యాపారుల సర్వే నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. వీరికి ప్రభుత్వా నిబంధనల ప్రకారం గుర్తింపు కార్డులు ఇచ్చినా అనంతరం రుణాలు లభిస్తాయని అన్నారు. ఈ సర్వేలో మెప్మా సిఎల్ ఆర్ పి లతోపాటు 24 మంది ఆర్పీలు పాల్గొన్నారు.

పట్టణంలో వీధి వ్యాపారుల సర్వే నిర్వహిస్తున్న దృశ్యం…

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!