Social 1080×1350 • Multi-page
20-09-2025 BREAKING NEWS 04:14 PM
swarnodayam.com
Telugu Daily News

విద్యాసంస్థల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు.. – ముఖ్య అతిథులుగా పాల్గొన్న న్యాయమూర్తులు..

విద్యాసంస్థల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు.. – ముఖ్య అతిథులుగా పాల్గొన్న న్యాయమూర్తులు..
IMG-20250920-WA0063

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన బతుకమ్మ పండగను పురస్కరించుకొని శనివారం హుజూరాబాద్ పట్టణంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు విద్యార్థినిల, మహిళా ఉపాధ్యాయినీలు భక్తిశ్రద్ధలతో ఆనంద ఉత్సాహాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని బాలికల పాఠశాల, ప్రభుత్వం ఉన్నత పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల జూనియర్ కళాశాల, కాకతీయ కళాశాల, శాతవాహన హై స్కూల్, న్యూ కాకతీయ హై స్కూల్, మాంటిసోరి, శస్త్ర, ఆదర్శ, వివేకవర్ధిని, విజ్ఞాన్, కేరళ, టెట్రా హైడ్రాన్, కృష్ణవేణి, శ్రీ కాకతీయ లతోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లోని పాఠశాలల్లో విద్యార్థులు ముందస్తు బతుకమ్మ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా పిల్లలు ఉపాధ్యాయులు తెలంగాణ సాంప్రదాయ దుస్తులను ధరించి బతుకమ్మలను పేర్చి పాఠశాల ఆవరణలో బతుకమ్మ పాటలు పాడుతూ ఆడుతుకన్నారు. ఈ సందర్భంగా హుజురాబాద్ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి పిబి కిరణ్ కుమార్, జడ్జి పద్మ సాయిశ్రీ లు హాజరై బతుకమ్మ పండుగ విశేషాలతో పాటు చట్టాలపై అవగాహన కల్పించారు. అనంతరం పిల్లలతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. బతుకమ్మ సంబరాలతో పాఠశాల ఆవరణాలన్నీ పండుగ వాతావరణం నెలకొంది. గత ఏడాదికన్నా ఈసారి ప్రతి పాఠశాల వారు పోటీపడి మరి బతుకమ్మ వేడుకలు నిర్వహించడం కొసమెరుపు.

న్యూ కాకతీయ పాఠశాల వద్ద బతుకమ్మలతో న్యాయమూర్తులు పిబి కిరణ్ కుమార్, పద్మ సాయిశ్రీ.. పాఠశాల నిర్వాహకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు..

విద్యార్థులను ద్వేషించి మాట్లాడుతున్న హుజురాబాద్ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి పిబి కిరణ్ కుమార్

శాతవాహన స్కూల్ వద్ద బతుకమ్మలతో పాఠశాల కరస్పాండెంట్ వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు…

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!