Social 1080×1350 • Multi-page
21-09-2025 BREAKING NEWS 07:51 PM
swarnodayam.com
Telugu Daily News

విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయాల్లో వెనుకబడిన వారి కోసం తెలంగాణ జాగృతి ముందుండి పని చేస్తుంది.. – తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల కవిత

విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయాల్లో వెనుకబడిన వారి కోసం తెలంగాణ జాగృతి ముందుండి పని చేస్తుంది.. – తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల కవిత
IMG-20250921-WA0101

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (కరీంనగర్):విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయాల్లో వెనుకబడిన వారి కోసం తెలంగాణ జాగృతి ముందుండి పని చేస్తుందనీ సామాజిక ఉద్యమ నాయకురాలు, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తెలంగాణలో బడుగు బలహీన వర్గాల సమస్యల పరిష్కారం కొరకు పోరాడుతూనే… తెలంగాణలో ఆదివాసుల ఆత్మగౌరవంతో కూడిన వారి హక్కులను పరిరక్షించడానికి ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ వారి పక్షాన అండగా నిలబడుతున్న సామాజిక ఉద్యమ నాయకురాలు, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల కవిత నాయకత్వంలో తెలంగాణ ఆదివాసి జాగృతి సమావేశం తేదీ 21 సెప్టెంబర్ 2025 ఆదివారం రోజున తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది.

ముఖ్యఅతిథిగా కవిత హాజరై ఆమె మాట్లాడుతూ తెలంగాణలో ఇప్పటికి రాజ్యాంగ ఫలాలు పభుత్వ సంక్షేమ పథకాలు విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయాల్లో వెనుకబడి ఉన్న వారి కోసం తెలంగాణ జాగృతి ముందుండి పనిచేస్తదని తెలియజేశారు. ముఖ్యంగా ఆదివాసుల వారి వారి పండుగలు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విధంగా క్యాలెండర్ తయారుచేసి క్యాలెండర్ ప్రకారంగా ప్రతి సంవత్సరం ప్రతి నెలలో వచ్చే ఆదివాసి జాతరలను వారి నాయకుల వర్ధంతిలను జయంతులను తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఘనంగా జరపాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇంత మంచి నిర్ణయాలు తీసుకొని మా జాతికి అండగా నిలబడుతున్న కవితక్కకి తెలంగాణ ఆదివాసి జాగృతి తరఫున రుణపడి ఉంటామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి జాగృతి రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజుతోపాటు 24 జిల్లాల నుండి ఆదివాసి జాగృతి రాష్ట్ర నాయకులు కూతాడి రవికుమార్, కురుసాంగి వేణు,
సోయం గోవర్ధన్, పాతపల్లి నరసింహ, రామకృష్ణ, ప్రకాష్,
శడుమాకి సంజీవ్, ఆత్రం సాయి, కుర్ర రవీందర్, పాలకుర్తి కృష్ణ,
మాధవి, పురుషోత్తం, సుదర్శన్, వెంకటేష్, కురుసాంగి పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

Oplus_16908288
తెలంగాణ ఆదివాసి జాగృతి సమావేశంలో మాట్లాడుతున్న సామాజిక ఉద్యమ నాయకురాలు, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల కవిత

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!