24-09-2025 NORMAL NEWS 06:00 PM
swarnodayam.com
Telugu Daily News
24-09-2025 06:00 PM By Mandala Yadagiri

నాగార్జున డైరీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు..

నాగార్జున డైరీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు..
IMG-20250924-WA0087

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లి గ్రామంలోనీ నాగార్జున డేయిరి ఆవరణలో బుధవారం బతుకమ్మ సంబరాలు కన్నుల పండువగ నిర్వహించారు. బతుకమ్మ సంబురాలను శ్రీమతి అహల్య ప్రభాకర్ రావు సిబ్బందితో కలిసి ప్రారంభించగా ప్రతి నిత్యం డేయిరి విధులలో నిమగ్నం అయినా సిబ్బందికి సకల సౌకర్యలు ఏర్పాటు చేసి కొలహాలంగా ఆటపాటలతో అనందంగా అడిపాడారు. తీరకప్పులతో అందంగా పేర్చిన బతుకమ్మలను చేత పట్టుకొని డైరీ వద్దకు చేరుకున్న మహిళలు ఎంతో కోలాహాలంగా ఆనందోత్సాహాల మధ్య వేడుకలు నిర్వహించగా చూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డైరీ ఏండి పుల్లూరి ప్రభాకర్ రావు, డైరెక్టర్ శ్రీమతి శృతి గణేష్ రావు, ceo కృష్ణ ప్రసాద్, AGM ఆకునూరి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

బతుకమ్మ సంబురాలను సిబ్బందితో బతుకమ్మలతో వచ్చి ప్రారంభిస్తున్న శ్రీమతి అహల్య ప్రభాకర్ రావు …

నాగార్జున డైరీలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న డైరీ నిర్వాహకులు, ఉద్యోగులు, సిబ్బంది..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!