Social 1080×1350 • Multi-page
24-09-2025 BREAKING NEWS 08:11 PM
swarnodayam.com
Telugu Daily News

సంఘ సభ్యులకు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి. -చేనేత సంఘ 84వ మహానభ

సంఘ సభ్యులకు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి. -చేనేత సంఘ 84వ మహానభ
IMG-20250924-WA0133

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ చేనేత సహకార సంఘ సభ్యులకు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తానని జిల్లా చేనేత జౌళి శాఖ అభివృద్ధి అధికారి ఎoఏ హజార్ వహాబ్ అన్నారు. బుధవారం హుజూరాబాద్ పట్టణంలో చేనేత పారిశ్రామికుల సహకార ఉత్పత్తి, విక్రయ సంఘం 72వ వార్షిక 84వ మహాసభ అధ్యక్షుడు ఎలిగేటి ఉపేందర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సభ్యుల హెల్త్ కార్డ్స్, అంత్యోదయ కార్డ్స్, నేతన్న ధర పథకాల గూర్చి ఉన్నత అధికారుల దృష్టికి తెస్తానని, సభ్యుల ఆరోగ్యం కొరకు హెల్త్-క్యాంప్ ఏర్పాటు చేయిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా సంఘ ఆదాయ వ్యయాలను ప్రవేశపెట్టి 19 తీర్మానాలను ఆమోదించారు. ఈ కార్యక్రమంలో సంఘ పర్సన్ -ఇంచార్జి ఎలిగేటి ఉపేందర్, వేముల యాదగిరి, గుండేటీ మహదేవ్, మంచికట్ల వెంకటయ్య, మండల సత్యనారాయన, మంచికట్ల సుమలత, వాణి, మేనేజర్ నక్క వైకుంఠము, క్యాషియర్ ఎం కోటిలింగం తదితరులు పాల్గొన్నారు. కాగా అధిక కూళ్లు సాధించిన కార్మికులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.

మహాసభలో మాట్లాడుతున్న జిల్లా చేనేత జౌళి శాఖ అభివృద్ధి అధికారి ఎoఏ హజార్ వహాబ్..

మహాసభలో మాట్లాడుతున్న సంఘ పర్సన్ -ఇంచార్జి ఎలిగేటి ఉపేందర్
అధిక కూళ్లు సాధించిన కార్మికులకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్న అతిథులు…

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!