Social 1080×1350 • Multi-page
24-09-2025 BREAKING NEWS 10:04 PM
swarnodayam.com
Telugu Daily News

ఎన్ఎస్ఎస్ సేవా భావాన్ని పెంపొందిస్తుంది.. – జాతీయ సేవా పథకం దినోత్సవం.. – ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వి ఆంజనేయరావు

ఎన్ఎస్ఎస్ సేవా భావాన్ని పెంపొందిస్తుంది.. – జాతీయ సేవా పథకం దినోత్సవం.. – ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వి ఆంజనేయరావు
IMG-20250924-WA0178

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి , హుజురాబాద్:
విద్యార్థుల్లో జాతీయత భావము, సేవా భావాన్ని ఎన్ఎస్ఎస్ పెంపొందిస్తున్నదనీ హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వి ఆంజనేయరావు అన్నారు. బుధవారం హుజురాబాద్ పట్టణంలో ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ సేవా పథకం దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ పథకాన్ని ఎగురవేసి వందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…సేవ అంటే ఎంత చేశామని కాదు, ఎంత మందికి ఉపయోగ పడ్డామనేది ముఖ్యం అని,విద్యార్థి దశ నుండే మీరు ఒకరినొకరు సహాయం చేసుకునే అలవాటు చేసుకోవాలని, సన్నిహితంగా ఉండాలని అన్నారు. అనంతరం NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ సుగుణ మాట్లాడుతూ…నేటి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా ఎన్ఎస్ఎస్ తయారు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు ప్రసాద్, తులసీ దాసు, వాసుదేవా రావు, విజేందర్ రెడ్డి, మల్లారెడ్డి, రేణుక, రామ్ రాజ్, పున్నం చందర్ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారిని సుగుణ..

ప్రతిజ్ఞ చేస్తున్న అధ్యాపకులు విద్యార్థులు…

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!