Social 1080×1350 • Multi-page
25-09-2025 BREAKING NEWS 06:29 PM
swarnodayam.com
Telugu Daily News

పోస్టల్ ఉద్యోగులకు కూడా 78 రోజుల దసరా బోనస్ ప్రకటించాలి.. – దేశాభివృద్ధిలో పోస్టల్ ఉద్యోగుల పాత్ర కీలకం… ఏఐపిఈయూ -గ్రూప్ సి రాష్ట్ర అధ్యక్షుడు యు మహేందర్

పోస్టల్ ఉద్యోగులకు కూడా 78 రోజుల దసరా బోనస్ ప్రకటించాలి.. – దేశాభివృద్ధిలో పోస్టల్ ఉద్యోగుల పాత్ర కీలకం… ఏఐపిఈయూ -గ్రూప్ సి రాష్ట్ర అధ్యక్షుడు యు మహేందర్
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: దేశ వ్యాపితంగా ఎంతో ఘనంగా జరుపుకునే విజయదశమి పర్వదినం సమీపిస్తున్న తరుణంలో దేశంలోని 1,64,999 గ్రామీణ మరియు పట్టణ తపాలా కార్యాలయాల్లో పనిచేస్తున్న దాదాపు 4,57,997 మంది తపాలా ఉద్యోగులు తపాలా శాఖ ప్రకటించే ఉత్పదిత ఆధారిత బోనస్ (పిఎల్ బి) దసరా పండగకు చెల్లించే బోనస్ కోసం ఎదురు చూస్తున్నారని ఏఐపిఈ యూ -గ్రూప్ సి రాష్ట్ర అధ్యక్షుడు యు మహేందర్ గురువారం ఒక పప్రకటనలో పేర్కొన్నారు. కేంద్రం, రాష్ట్రం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు చేరుస్తూ, క్షేత్ర స్థాయిలో విజయవంతంగా అమలు చేస్తూ, బ్యాంకింగ్ రంగంలో సైతం గ్రామీణ ప్రాంత ప్రజలకు నిర్వీరామ ఆర్థిక సేవలు అందిచడంలో పోస్టల్ ఉద్యోగులు ముందున్నారన్నారు. దేశాభివృద్ధిలో తపాలా శాఖ కీలక పాత్రవహిస్తున్నదని తెలుపుతూ, నిన్న రైల్వే ఉద్యోగులకు కేంద్రం ప్రకటించిన విధంగానే 78 రోజుల బోనస్ ను తపాలా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించి వెంటనే చెల్లించాలన్నారు. కేంద్ర ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇప్పటి వరకు కేంద్రం డిఏ, డిఆర్ ప్రకటించక పోవడం శోచనీయమని అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే డిఏ, డిఆర్ ప్రకటించి జూలై మాసం నుండి కేంద్ర ఉద్యోగులకు, పెన్షనర్లకు బకాయీలను చెల్లించాలని అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం గ్రూప్ సి రాష్ట్ర అధ్యక్షులు ఊకంటి మహేందర్ డిమాండ్ చేశారు.

Oplus_16908288

ఏఐపిఈయూ -గ్రూప్ సి రాష్ట్ర అధ్యక్షుడు యు మహేందర్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!