Social 1080×1350 • Multi-page
26-09-2025 BREAKING NEWS 11:25 PM
swarnodayam.com
Telugu Daily News

కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు.. – కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు..

కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు.. – కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు..
Oplus_16908288

– రిజర్వేషన్లు అమలుకు సీఎం రేవంత్ రెడ్డి అహర్నిశలు కృషి..
రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం..

– ఇస్తే మడమ తిప్పనిది కాంగ్రెస్ పార్టీ..

కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు..

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీపై వెలిచాల హర్షం..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు..

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడంపై వెలిచాల రాజేందర్ రావు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనక్కి తగ్గదనీ.. మడమ తిప్పదని ఈరోజు మరోసారి రుజువైందని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం బిసిలను రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాలలో అభివృద్ధి చేయాలన్న ప్రధాన లక్ష్యంతోనే 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి వర్గం బిసి రిజర్వేషన్లు అమలు కోసం అహర్నిశలు కృషి చేశారని వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని రాజేందర్రావు పేర్కొన్నారు. బిసి సమాజం పక్షాన, కాంగ్రెస్ పార్టీ తరపున వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమలు చేసేందుకు కృషి చేసిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం నడుచుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ అనీ ఒకసారి హామీ ఇస్తే ఆ హామీ అమలయ్యే వరకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. వెనక్కి తగ్గే పరిస్థితి ఉండదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ, సాంకేతిక, న్యాయ పరమైన, రాజ్యాంగ పరమైన అన్ని రకాల చర్యలు తీసుకొని ఇప్పుడు జీవో జారీ చేసిందన్నారు. దేశంలో ఒక పకడ్బందీగా, కులగణన చేపట్టి, బీసీ కమిషన్ వేసి అన్ని రకాలుగా సాంకేతికంగా సమాచారాన్ని సేకరించి రిజర్వేషన్లు అమలు చేసేందుకు జీవో జారీ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి కి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న తపనకు నిదర్శనమని వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడంలో ప్రత్యేకంగా కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ఇతర మంత్రులకు రాజేందర్ రావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!