Social 1080×1350 • Multi-page
27-09-2025 BREAKING NEWS 09:07 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ లో పలుచోట్ల ఘనంగా బతుకమ్మ వేడుకలు..

హుజురాబాద్ లో పలుచోట్ల ఘనంగా బతుకమ్మ వేడుకలు..
IMG-20250927-WA0114

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ కోర్టులో శనివారం న్యాయమూర్తులు న్యాయవాదులు కోర్టు సిబ్బంది ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండుగ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య జరిగాయి. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి పిబి కిరణ్ కుమార్ కొబ్బరికాయ కొట్టి వేడుకలను ప్రారంభించారు. ఈ సంబరాలలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పద్మ సాయిశ్రీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు యతిపతి అరుణ్ కుమార్, జనరల్ సెక్రటరీ ఏరోళ్ళ రమేష్, జూనియర్ అండ్ సీనియర్ న్యాయ వాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

కోర్టు ఆవరణంలో కొబ్బరికాయ కొట్టి బతుకమ్మ వేడుకలను ప్రారంభిస్తున్న సీనియర్ సివిల్ జడ్జి కిరణ్ కుమార్..

ఏరియా ఆసుపత్రిలో

హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో శనివారం వైద్యులు సిబ్బంది కలిసి బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో బతుకమ్మలను పెట్టి పాటలు పాడుతూ ఆడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ నల్ల నారాయణరెడ్డి, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ చందు, డాక్టర్ రమేష్ డాక్టర్ స్రవంతి, సుజాత మౌనిక తదితరులు పాల్గొన్నారు.

ఏరియా ఆసుపత్రిలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న దవఖాన సూపరిండెంట్ నారాయణరెడ్డి ఇతర వైద్యాధికారులు..

మున్సిపల్ కార్యాలయంలో
హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయంలో శనివారం మున్సిపల్ కార్యాలయ ఉద్యోగులు, మెప్మా ఉద్యోగులు బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య మేనేజర్ భూపాల్ రెడ్డి టిపిఓ అశ్విని గాంధీ , ఆర్తి, రమా, స్వరూప , సిబ్బంది పాల్గొన్నారు.

మున్సిపల్ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!