Social 1080×1350 • Multi-page
28-09-2025 BREAKING NEWS 11:57 AM
swarnodayam.com
Telugu Daily News

ప్రముఖ వేద పండితుడు దత్తయ్య గారు ఇక లేరు..

ప్రముఖ వేద పండితుడు దత్తయ్య గారు ఇక లేరు..
FB_IMG_1759040202074

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ ప్రాంతంలో ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ వేద పండితుడు సామాన్యుడి నుంచి ప్రధాని వరకు పూజలు అందించిన పురోహితుడు శ్రీ అవధానుల దత్తాత్రేయ శర్మ కొద్దిసేపటి క్రితం కరీంనగర్ లోని అపోలో రిచ్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. శ్రీ దత్తయ్యగారు.. అందరూ ప్రేమతో పిలుచుకునే పేరు.. అసలు పేరు బ్రహ్మశ్రీ అవధానుల దత్తాత్రేయశర్మ.. మా ఊరి అయ్యగారు.. హుజురాబాద్ కు పెద్ద దిక్కు మీరు.. మీరు శివైక్యం చెందారన్న వార్త నమ్మ లేకుండా ఉంది.. మీ తీయని కంఠం.. మీ వేదమంత్రాలు.. ఉచ్చారణ.. మా హుజురాబాద్లో.. ప్రజల్లో.. ప్రతిధ్వనిస్తున్నాయి.. మీరు మంత్రాలు చదివితే దేవతలు వచ్చి కూర్చున్నారు అన్న భావన కలుగుతుంది.. హుజురాబాద్ ప్రజల ప్రేమను మీరు గెలిచారు.. మీరు లేని లోటు పూడ్చలేనిది.. ఒక నాలుగు ఐదు తరాల.. వివాహాలను కార్యక్రమాలను మీరు నిర్వహించారు.. వైదిక ధర్మాన్ని పాటిస్తూ.. చివరి శ్వాస వరకు.. ధర్మబద్ధంగా వ్యవహరించారు.. మాలో దైవ చింతన పెంచారు.. ఏనాడు వ్యాపారత్మక ధోరణితో వ్యవహరించలేదు.. హుజురాబాద్ ప్రజల సంక్షేమాన్ని కోరుకున్నారు.. అందరూ బాగుండాలని పరితపించారు.. మీ సైకిల్ ఇప్పటికీ మా కళ్ళల్లో కదలాడుతూనే ఉంటుంది.. ఇది దత్తయ్య గారి సైకిల్ అనేవారు.. దానికి ఒక చెక్కల పైడిల్ ఉండేది.. ఇది మీ సామాన్య జీవనాన్ని.. కష్టపడే తత్వానికి నిదర్శనం.. ఇచ్చింది తీసుకున్నారు.. ఏనాడూ ఎవరిని ఏమీ డిమాండ్ చేయలేదు.. పాత వాడకు పెద్దదిక్కుగా ఉన్నారు.. ఎవరిని పల్లెత్తు మాట అనలేదు.. హుజురాబాద్ ప్రాంతంలో సామాన్య ప్రజల నుంచి మొదలుకొని ప్రధానిగా పీవీ నరసింహారావు ఢిల్లీలో ఉంటే హుజురాబాద్ నుండి హైదరాబాద్ కు తీసుకువెళ్లి అక్కడినుండి విమానంలో ఢిల్లీకి తీసుకువెళ్లి ఆయన చే పూజలు చేయించుకునేవారు. అంతటి గొప్ప మనసున్న వ్యక్తి అవధానుల దత్తాత్రేయ శర్మకు నలుగురు కుమారులు కాగా ముగ్గురు కుమారుల(మృతి చెందగా) ఆ బాధను.. మనసులో దాచుకున్న.. శివనామ స్మరణ మానలేదు.. ప్రస్తుతం ఆయనకు భాస్కర్ శర్మ చిన్న కుమారుడు మాత్రమే ఉన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి మృతి చెందడంతో ఆయన జ్ఞాపకాలు హుజురాబాద్ ప్రజలు నెమరు వేసుకుంటున్నారు. ఈ ప్రాంత ప్రజలతో ఆయన జ్ఞాపకాలు ఎప్పుడు ఉండిపోతాయి.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రజా ప్రతినిధులు వివిధ పార్టీల నాయకులు, వ్యాపారులు, అన్ని వర్గాల ప్రజలు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

ఎంతో సాధారణ జీవితం గడిపిన గొప్ప వేద పండితుడు అవధానుల దత్తాత్రేయ శర్మ (పాత చిత్రం)

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!