Social 1080×1350 • Multi-page
28-09-2025 BREAKING NEWS 05:18 PM
swarnodayam.com
Telugu Daily News

నడుస్తున్నది డిజిటల్ మీడియా యుగం.. -WJI జమ్మికుంట మండల అధ్యక్షులు అంబాల ప్రభాకర్

నడుస్తున్నది డిజిటల్ మీడియా యుగం.. -WJI జమ్మికుంట మండల అధ్యక్షులు అంబాల ప్రభాకర్
IMG-20250928-WA0042

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా చెందిన గ్రామీణ ప్రాంత విలేకరులు అప్డేట్ కావాలని వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా (WJI) జమ్మికుంట మండల అధ్యక్షులు అంబాల ప్రభాకర్ కోరారు. ఆదివారం జమ్మికుంట ఆర్ట్ గ్యాలరీలో సంఘ సమావేశం జరిగింది. సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తూ డిజిటల్ మీడియా ప్రవాహంలో ప్రధాన స్రవంతి ప్రధాన న్యూస్ ఛానల్ కొట్టుకుపోతున్నాయని ఈ సందర్భంలో వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ప్రతి ఒక్క గ్రామీణ జర్నలిస్టులు పాటుపడాలని ఆయన కోరారు. దీనికోసం ప్రెస్ అకాడమీ సౌజన్యంతో WJI శిక్షణ తరగతులను నిర్వహిస్తుందని ఆయన తెలిపారు. సంఘ సభ్యులు గురుతరమైన బాధ్యతలు కలిగి ఉండాలనీ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపైక్షించపోమని ఇతర యూనియన్లలో కూడా కొనసాగుతామంటే భావ్యం కాదని అన్నారు. WJI ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ మాట్లాడుతూ..ఇటీవల కుమార్ యాదవ్ పట్ల ఓ మాజీ ప్రజాప్రతినిధి ప్రవర్తించిన విధానాన్ని తీవ్రంగా ఖండించారు. తాను డబ్ల్యూజేఐ నుండి వెళ్ళిపోతున్నట్టుగా వస్తున్న పుకార్లు ఎవరు నమ్మవద్దని ఆయన కోరారు. డబ్ల్యూజేఐ పటిష్టత కోసం తాను అహర్నిశలు కృషి చేస్తాను అని హామీ ఇచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు ప్రసంగించారు. ఇటీవల తనకు జరిగిన సంఘటన గురించి జర్నలిస్టు కుమార్ యాదవ్ వివరించారు.

సమావేశంలో మాట్లాడుతున్న అధ్యక్ష, కార్యదర్శులు ప్రభు, ఆర్కే…

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!