28-09-2025 NORMAL NEWS 07:07 PM
swarnodayam.com
Telugu Daily News
28-09-2025 07:07 PM By Mandala Yadagiri

మహా కవి గుర్రం జాషువా 130 వ జయంతి

మహా కవి గుర్రం జాషువా 130 వ జయంతి
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: మహా కవి గుర్రం జాషువా 130వ జయంతి సందర్భంగా హుజురాబాద్ లోని విజ్ఞాన వికాస కేంద్రంలో ఆదివారం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మానవ వికాస వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ రొంటాల బుచ్చయ్య, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు కల్వల మల్లయ్య, మారపెల్లి శ్రీనివాస్, బొడ్డు సంజీవ్ అంబేద్కర్ నాయకుడు, ఇల్లందుల రమేష్ అంబేద్కర్ నాయకుడు, మేకల నవీన్ లెక్చర్ కళాకారుడు, వేముల చందన, డాన్సర్ఆడెపు వినోద కళాకారులూ పాల్గొన్నారు. కాగా ఈ సందర్భంగా విశ్వకవి గుర్రం జాషువా గురించి అయన చేసిన సేవలు, మరియు రచనలు చేసిన గబ్బిలం లాంటి పుస్తకాలు బ్రాహ్మణ బావ జాలం గురించి తన కలము నుండి జాలువరిన రచనలు అయన ఆశయాలు, గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది.
గుర్రం జాషువా ఎన్నో పద్యాలా ద్వారా మనుషులు అంత ఒక్కటే ఒక్కరికి ఒక్కరు కలిసి మెలిసి బ్రతకాలి కులం, మతం లేని మానవ సమాజం నిర్మాణం చేయాలి అప్పడే అందరు బాగుంటారు తరతమ్యాలు లేని సమాజం నిర్మాణం మన అందరి బాధ్యత అని పద్యాలు, రచనాల ద్వారా తెలిచెప్పిన గొప్ప నాయకుడు గుర్రం జాషువా అని పలువురు వారి ఉపన్యాసం ద్వారా తెలియజేశారు.

మహాకవి గుర్రం జాషువా చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న మానవ వికాస వేదిక ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!