Social 1080×1350 • Multi-page
28-09-2025 BREAKING NEWS 11:41 PM
swarnodayam.com
Telugu Daily News

దత్తయ్యగారి పార్థివదేహానికి నివాళులర్పించిన మాజీ ఎంపీ కెప్టెన్, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్

దత్తయ్యగారి పార్థివదేహానికి నివాళులర్పించిన మాజీ ఎంపీ కెప్టెన్, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
IMG-20250928-WA0101

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, సెప్టెంబర్ 28: హుజురాబాద్ పట్టణానికి చెందిన వేద పండితులు, ప్రముఖ పురోహితులు అవధానుల దత్తాత్రేయశర్మ (దత్తయ్య గారు) (95) ఆదివారం ఉదయం మృతి చెందారు. దత్తయ్యగారి పార్థివ దేహాన్ని మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి లక్ష్మీ కాంతారావు సరోజినీదేవి దంపతులు, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు వి సతీష్ కుమార్ లు సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. దత్తయ్యగారి మృతి తీరనిలోటని అన్నారు. ఆయన జిల్లా, రాష్ట్రవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారని, సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించేందుకు కృషి చేశారని ప్రశంసించారు. ఆయన మృతికి సంతాపాన్ని కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. తమ కుటుంబానికి దత్తయ్యతో ఎంతో అనుబంధం ఉందని, తమకు అన్ని విషయాల్లో మార్గ నిర్దేశం చేసేవారని, పెద్దవారిగా ప్రోత్సహించేవారని, ఎంత దిగిన వొదిగి ఉండేవారని, ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరించేవారని గుర్తు చేసుకున్నారు. వారి వెంట బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

పూలమాలవేసి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు..

పూలమాలవేసి నివాళులర్పిస్తున్న మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్..

దత్తాత్రేయ మృతదేహం వద్ద విషాన్నవదనంలో మాజీ ఎంపీ లక్ష్మీకాంతరావు, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, నాయకులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!