Social 1080×1350 • Multi-page
29-09-2025 BREAKING NEWS 07:36 PM
swarnodayam.com
Telugu Daily News

తల్లి జ్ఞాపకార్థం భక్తులకు త్రాగునీటి వితరణ

తల్లి జ్ఞాపకార్థం భక్తులకు త్రాగునీటి వితరణ
IMG-20250929-WA0165


మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, సెప్టెంబర్ 29: హుజురాబాద్ పట్టణంలోని మారుతీనగర్ లో సీనియర్ జర్నలిస్ట్ నిమ్మటూరి సాయికృష్ణ తన తల్లి రాజేశ్వరి జ్ఞాపకార్థం త్రాగు నీటిని అందించి ఉదారత చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ కేమ్సారపు సమ్మయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బతుకమ్మ ప్రాంగణానికి తరలివచ్చే భక్తులకు ముఖ్యంగా మహిళలకు త్రాగునీటిని అందించాలనే ఉద్దేశ్యంతో గత ఆరు సంవత్సరాలుగా త్రాగునీరు అందించడం అభినందనీయమని అన్నారు. అలాగే, నిమ్మటూరి సాయికృష్ణ మాట్లాడుతూ.. త్రాగునీటి కోసం మహిళలు ఇబ్బందులు పడడం గమనించి, ఉచితంగా నీటిని అందించేందుకు పూనుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాజకీయ ప్రముఖులు, భక్తులు సాయికృష్ణను అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ కొలిపాక నిర్మల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్, బిఆర్ఎస్ నాయకులు తులసి లక్ష్మణామూర్తి, మున్సిపల్ సిబ్బంది శానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్, ప్రతాప రాజు, వెంకట్రాజం, కిరణ్, వెంకటేష్, కిషన్, అరవింద్, హరీష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

మినరల్ వాటర్ అందజేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య
బతుకమ్మ ఆడుకునేందుకు వెళ్తున్న వారికి తాగునీరు అందజేస్తున్న మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కొలిపాక నిర్మల శ్రీనివాస్
Oplus_16908288

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!