Social 1080×1350 • Multi-page
02-10-2025 BREAKING NEWS 07:14 PM
swarnodayam.com
Telugu Daily News

ఘనంగా గాంధీ జయంతి వేడుకలు… – ఉర్రూతలూగిన దసరా మహోత్సవంలో పాల్గొన్న జేఏసి పోలాడి.

ఘనంగా గాంధీ జయంతి వేడుకలు… – ఉర్రూతలూగిన దసరా మహోత్సవంలో పాల్గొన్న జేఏసి పోలాడి.
IMG-20251002-WA0027

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: గురువారం మహాత్ముని జయంతి వేడుకలు, విజయదశమి దసరా పండుగ మహోత్సవాన్ని కరీంనగర్ జిల్లా, మానకొండూరు మండల పరిధి లోని వన్నారం గ్రామ పంచాయతి ఆధ్వర్యంలో
పంచాయతి కార్యాలయం ఎదుట గాంధీ జయంతి వేడుకలను గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఇదే గ్రామానికి చెందిన ప్రజా సంఘాల నాయకుడు, సీనియర్ సిటిజన్ పోలాడి రామారావు పాల్గొని మహాత్ముని చిత్ర పటానికి గ్రామస్థులతో కలిసి పూలాభిషేకం నిర్వహించి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం విజయ దశమి దసరా పండుగ సందర్భంగా గ్రామ ప్రధాన వీధి మీదుగా డప్పు చప్పులు, డిజె సౌండ్ వాయిద్యాల తో యువతీ యువకుల నృత్యాలతో మహిళల కోలాటాల, యువకుల కేరింతల నడుమ గ్రామ భక్తాంజనేయ స్వామి ఆలయంవద్ద పూజలు నిర్వహించి అక్కడి నుంచి గ్రామ దేవతల వేదిక వరకు భారీ ఊరేగింపుతో ఉర్రూతలతో ఘనంగా దసరా మహోత్సవం నిర్వహించారు. గ్రామ ప్రాథమిక పాఠశాల వద్ద నెలకొల్పిన జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించి గ్రామ ప్రజలు ఒకరి కొకరు జమ్మి ఆకులను పంచుకుంటూ ఉత్సాహంగా ఆలయ్ భలయి చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ప్రజా సంఘాల నాయకుడు సీనియర్ సిటిజన్ పోలాడి రామారావు గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, గ్రామ పంచాయతి ఉద్యోగులు, భారీ సంఖ్యలో యువత మహిళలు ఉన్నారు. తెలుగు ప్రజలందరూ కుటుంబ సభ్యులతో అనురాగాలు పంచుకుంటూ స్నేహితుల ఆప్యాయతల మధ్య ఉత్సాహంగా సంతోషంగా ఉండాలని, దుర్గా మాత ఆశీస్సులు మనకందరికీ ఉండాలని కోరుకుంటూ పోలాడి రామారావు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ప్రకటించారు.

దసరా వేడుకల్లో చిందులేస్తున్న జాతీయ నాయకుడు రామారావు..

—————+++++——————–

&&లోకల్ యాడ్స్&&

—————-++++++++++————

##దసరా శుభాకాంక్షలు##

&&దేవి ఎంటర్ప్రైజెస్ వారి దసరా శుభాకాంక్షలు &&

&&విహెచ్పి మండల శాఖ తరపున దసరా శుభాకాంక్షలు &&

##పిఎసిఎస్ తుమ్మనపల్లి తరపున దసరా శుభాకాంక్షలు##

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!