Social 1080×1350 • Multi-page
03-10-2025 BREAKING NEWS 06:39 PM
swarnodayam.com
Telugu Daily News

ఘనంగా విజయదశమి వేడుకలు.. -ఆకట్టుకున్న రావణాసుర వధ.. – శమీ పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.

ఘనంగా విజయదశమి వేడుకలు.. -ఆకట్టుకున్న రావణాసుర వధ.. – శమీ పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.
IMG-20251003-WA0149

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
హుజురాబాద్ డివిజన్ లో విజయదశమి పర్వదిన వేడుకలు గురువారం ప్రజలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. హుజురాబాద్ పట్టణంతోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లో గురువారం దసరా పండుగ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామపంచాయతీలో కార్యదర్శులు ఏర్పాటులు చేశారు. హుజురాబాద్ పట్టణంలో మున్సిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్య ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. దసరా పండుగ వేడుకలను హుజురాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో అంగరంగ వైభవంగా నిర్వహించే విధంగా ఏర్పాట్లు జరిగాయి. ఈ సందర్భంగా మైదానంలో భారీ గేట్లు ఏర్పాటు చేయడమే కాకుండా ఉత్సవ విగ్రహాల ప్రత్యేక పూజల కోసం వేదికను సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం కోసం వేదిక ఏర్పాటు చేశారు. రావణాసుర వద ఏర్పాటు చేశారు. పట్టణంలోని రామాలయం నుండి ఉత్సవ విగ్రహాలను డప్పు చప్పులతో మేళ తాళాలతో ఊరేగింపుగా వాహనంలో మైదానంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక వేదికపై నిలిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి ఆయన సతీమణి శాలినిరెడ్డి, కుమార్తె శ్రీనిక రెడ్డిలు పాల్గొని పూజారుల ఆశీర్వచనాలు పొందారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దసరా సందర్భంగా గుమ్మడికాయ కొట్టి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం పలువురు చిన్నారులు కూచిపూడి నృత్యాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. వరంగల్ కు చెందిన గాయకులు అనేక పాటలను పాడి ప్రజల ను ఆకట్టుకున్నారు. మైదానంలో ప్రజలందరికీ సాంస్కృతిక కార్యక్రమాలు కనపడే విధంగా రెండు ఎల్ఈడి స్క్రీన్ లను ఏర్పాటు చేశారు. హుజురాబాద్ టౌన్ సిఐటి కరుణాకర్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. చివరగా రావణాసురవదా కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, సిఐ కరుణాకర్ లు ప్రారంభించారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి సహకరించిన అన్ని వర్గాల ప్రజలకు ఉద్యోగులకు నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ భూపాల్ రెడ్డి, ఎస్సై యూనస్ అలీ, ఏఎస్ఐ రాజేశ్వరరావు, సానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్, వ్యాఖ్యాత విష్ణుదాస్ గోపాలరావు, డాన్స్ మాస్టర్ శ్వేత, మున్సిపల్ సిబ్బంది రొంటాల సుధీర్ కుమార్, ప్రతాప రాజు, అరెల్లి రమేష్, జీ అనిల్, కుమార్, తదితరులు పాల్గొన్నారు.

షమీ పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దంపతులు...

కత్తి ఎత్తి చూపుతున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి…

దసరా వేడుకల వద్ద మాట్లాడుతున్న ఎమ్మెల్యే సతీమణి శాలినిరెడ్డి…

దసరా వేడుకల్లో పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ దంపతులు గందె రాధిక శ్రీనివాస్..

ఆకట్టుకున్న రావణాసుర వధ కార్యక్రమం…

ప్రజలను ఉద్దేశించి మాట్లాడి… స్వచ్ఛభారత్ గురించి వివరిస్తున్న కమిషనర్ కే సమ్మయ్య

oplus_0

రామ్ లీలా వేడుకలకు పెద్ద ఎత్తున తరలివచ్చిన పట్టణ, మండల ప్రజలు…

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు…

——————++++++++++—————-

&&లోకల్ యాడ్స్&&

————++———+++——+++————-

##దసరా శుభాకాంక్షలు##

Oplus_16908288

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!