Social 1080×1350 • Multi-page
03-10-2025 BREAKING NEWS 11:36 PM
swarnodayam.com
Telugu Daily News

ఘనంగా అమ్మవారి ఊరేగింపు.. – దుర్గాదేవి నిమజ్జనం వేడుకలు.

ఘనంగా అమ్మవారి ఊరేగింపు.. – దుర్గాదేవి నిమజ్జనం వేడుకలు.
IMG_20251003_232731

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్:
హుజూరాబాద్ పట్టణంలోని ఓల్డ్ వేంకటేశ్వర టాకీస్ లో శ్రీ రుద్ర యూత్ అసోసియేషన్, శ్రీనగర్ కాలనీలోని శ్రీ అమ్మ భవాని యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన
అమ్మవారి శోభాయాత్రలు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా గురు, శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన ఈ శోభాయాత్ర ప్రధాన వీధుల గుండా సాగి భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం సాగింది. ఈ సందర్భంగా కాలనీవాసులు ఉత్సాహంగా, సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. పూలు చల్లి, హారతులిచ్చి అమ్మవార్లకు తమ భక్తిని చాటుకున్నారు. యాత్రకు మరింత శోభను అద్దేలా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాంప్రదాయ కోలాటం ప్రదర్శనలు చేస్తూ, భజన గీతాలు ఆలపిస్తూ ముందుకు సాగారు. వీరి నృత్యాలు, పాటలు భక్తులను ఆకట్టుకున్నాయి. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని, సుభిక్షంగా ఉండాలని అమ్మవార్లను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ రుద్ర యూత్ అసోసియేషన్ సభ్యులు సురేష్, నవీన్, ఉదయ్, మహేష్,అనిల్, ధోనీ, నాగేందర్ , కిషోర్, మణి, యశ్వంత్ , కృష్ణ, శ్రీ అమ్మ భవాని యూత్ నిర్వాహకులు సంతోష్ గౌడ్, వడ్లకొండ అనిల్ కుమార్, సతీష్ కుమార్ గౌడ్, నాగరాజు, సారంగపాణి, ఎస్ రమేష్, మొగిలి, సదాశివ్, మల్లారెడ్డి, నాగేశ్వరరావు, సాయి, అరుణ్, రవీందర్ తదితరులు భక్తి భావాన్ని, ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించింది.

ఓల్డ్ వేంకటేశ్వర టాకీస్ లో శ్రీ రుద్ర యూత్ అసోసియేషన్, శ్రీనగర్ కాలనీలోని శ్రీ అమ్మ భవాని యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన అమ్మవారి శోభాయాత్ర దృశ్యాలు.

————-++++++±++————-++++++———

&&లోకల్ యాడ్స్&&

———+++++++————-+++++++———–

##దసరా శుభాకాంక్షలు##

Oplus_16908288

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!