Social 1080×1350 • Multi-page
04-10-2025 BREAKING NEWS 07:43 PM
swarnodayam.com
Telugu Daily News

అనారోగ్యంతో మాజీ జెడ్పిటిసి బక్కారెడ్డి మృతి.. -పలువురి సంతాపం.

అనారోగ్యంతో మాజీ జెడ్పిటిసి బక్కారెడ్డి మృతి.. -పలువురి సంతాపం.
IMG-20251004-WA0043

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలం కందుగుల గ్రామానికి చెందిన మాజీ జెడ్పిటిసి సభ్యుడు బిఆర్ ఎస్ సీనియర్ నాయకులు పడిదం పక్కారెడ్డి(75) శనివారం అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

బక్కారెడ్డి హుజురాబాద్ ప్రాంత రాజకీయ నాయకులలో అత్యంత సీనియర్ నాయకుడు. సర్పంచిగా, ఎంపీటీసీగా, జెడ్ పిటిసిగా పనిచేశారు. ఆయన భార్య ప్రభావతి రెడ్డి గ్రామ తాజా మాజీ సర్పంచిగా పనిచేశారు. ఆయనకు ఇద్దరు కుమారులు. బక్కారెడ్డి మృతితో కందుగులలో విషాదఛాయలు అలుముకున్నాయి.
—బక్కారెడ్డి మృతి పట్ల ప్రముఖుల సంతాపం

మాజీ జెడ్పిటిసి సభ్యులు పడిదం బక్కారెడ్డి మృతి పట్ల హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెంబర్ లక్ష్మీకాంతరావు, హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు వి సతీష్ కుమార్, కాంగ్రెస్ ఇంచార్జ్ వి ప్రణవ్ బాబు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ ఎడవెల్లి కొండల్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ బెల్లి రాజయ్య, జయన్న ఫౌండేషన్ చైర్మన్ పింగళి జయపాల్ రెడ్డి, సామాజిక కార్యకర్త నలుబాల వేణుగోపాల్ వివిధ పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

మాజీ జెడ్పిటిసి సభ్యుడు, బిఆర్ ఎస్ సీనియర్ నాయకులు పడిదం పక్కారెడ్డి(ఫైల్)

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!