Social 1080×1350 • Multi-page
05-10-2025 BREAKING NEWS 02:19 PM
swarnodayam.com
Telugu Daily News

మాజీ జెడ్పిటిసి బక్కారెడ్డికి పలువురు ప్రజాప్రతినిధుల, నాయకుల, కుటుంబ సభ్యుల కన్నీటి వీడ్కోలు.

మాజీ జెడ్పిటిసి బక్కారెడ్డికి పలువురు ప్రజాప్రతినిధుల, నాయకుల, కుటుంబ సభ్యుల కన్నీటి వీడ్కోలు.
IMG_20251005_135945

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజూరాబాద్: హుజూరాబాద్ తాజా మాజీ జెడ్పీటీసీ సభ్యుడు, సీనియర్ బిఆర్ఎస్ పార్టీ నాయకుడు పడిదం బక్కారెడ్డి ఆకస్మిక మృతి పట్ల ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, బంధువులు అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన స్వగ్రామమైన హుజురాబాద్ మండలంలోని కందుగుల గ్రామంలోని ఆయన నివాసం వద్ద ఉంచిన పార్థివ దేహానికి పలువురు ప్రముఖులు హాజరై పూలమాలవేసి నివాళులర్పించారు. బక్కారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆయన సతీమణి తాజా మాజీ సర్పంచ్ ప్రభావతి రెడ్డిని ఓదార్చి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేశారు. పరామర్శించిన వారిలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి లక్ష్మికాంతారావు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితెల ప్రణవ్, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ సరోజనిదేవి, మాజీ మున్సిపల్ చైర్మన్ గందే రాధిక శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ మండల పట్టణ శాఖ అధ్యక్షులు సంగేమ్ ఐలయ్య, కొలిపాక శ్రీనివాస్, చొల్లేటి కిషన్ రెడ్డి, ఎడవల్లి కొండల్ రెడ్డి తదితరులు ఉన్నారు.

వీరంతా బక్కారెడ్డి ప్రజలకు అందించిన సేవలను స్మరించుకున్నారు. బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కందుగులకు విచ్చేసి నివాళులర్పించి, కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బక్కారెడ్డి పట్ల ఉన్న గౌరవంతో గ్రామం నుంచే కాక చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కడసారి చూపు చూసుకుని, ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు.

బక్కారెడ్డి మృతదేహంపై పూలమాల వేసే నివాళులర్పించిన అనంతరం ఆయన సతీమణి మాజీ సర్పంచ్ ప్రభావతిరెడ్డిని ఓదార్చుతున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి..

బక్కారెడ్డి మృతదేహంపై పూలమాల వేసే నివాళులర్పించిన అనంతరం ఆయన సతీమణి మాజీ సర్పంచ్ ప్రభావతిరెడ్డిని ఓదార్చుతున్న మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ఆయన సతీమణి మాజీ ఎంపీపీ సరోజినీదేవి..

బక్కారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి..

బక్కారెడ్డి మృతదేహంపై పూలమాల వేసే నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితెల ప్రణవ్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!