05-10-2025 NORMAL NEWS 06:51 PM
swarnodayam.com
Telugu Daily News
05-10-2025 06:51 PM By Mandala Yadagiri

మాజీ జెడ్పిటిసి బక్కారెడ్డి పాడేమోసిన ఎమ్మెల్యే..

మాజీ జెడ్పిటిసి బక్కారెడ్డి పాడేమోసిన ఎమ్మెల్యే..
IMG_20251005_184841

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మాజీ జడ్పీటీసీ బక్కారెడ్డి దహన సంస్కారాల్లో పాల్గొనీ ఆయన పాడే మోశారు శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ తాజా మాజీ జెడ్పిటిసి పడిదము బక్కరెడ్డి అనారోగ్యంతో చికిత్స పొందుతూ కరీంనగర్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో నిన్న శనివారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలు పైన స్వగ్రామం మండలంలోని కందుల గ్రామంలో ఆదివారం సాయంత్రం నిర్వహించారు. అంత్యక్రియాల్లో ఎమ్మెల్యే పాల్గొని ఆయన పాడే మోశారు.

అశ్రునయనాల మధ్య బక్కా రెడ్డి అంత్యక్రియలు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
అనారోగ్యంతో మృతి చెందిన మాజీ జెడ్పిటిసి సభ్యులు పడిదo బక్కారెడ్డి (78) అంత్యక్రియలు ఆదివారం ఆయన స్వగ్రామం హుజురాబాద్ మండలం కందుగుల గ్రామంలో కుటుంబ సభ్యుల, అభిమానుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. అనారోగ్యానికి గురై కరీంనగర్ లో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందగా, ఆయన మృతదేహానికి ఆదివారం హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి లక్ష్మీకాంతారావు, మాజీ ఎంపీపీ వి సరోజినీ దేవి, హుజురాబాద్ నియోజకవర్గం వి ప్రణవ్ బాబు, బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, మండల అధ్యక్షులు డాక్టర్ ఐలయ్య, నీటి సంఘం మాజీ అధ్యక్షులు చోల్లేటి కిషన్ రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు ఎడవల్లి కొండల్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి సభ్యురాలు కంకణాల విజయరెడ్డి, న్యాయవాది భగవాన్ రెడ్డి, ఇరుమళ్ళ సురేందర్ రెడ్డి, దయాకర్ రెడ్డి, తాళ్ల పెళ్లి శ్రీనివాస్ గౌడ్, బెల్లి రాజయ్య, కే విజయేందర్ రెడ్డి, నూరుల్లా, ఉప్పు శ్రీనివాస్ పటేల్, వీరసేనారెడ్డి, రాముల కుమార్, తూర్పాటి రాజు, పోరెడ్డి కిషన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి లతోపాటు వివిధ పార్టీల నాయకులు కుటుంబ సభ్యులు ఆయన మృతదేహం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. భార్య ప్రభావతి రెడ్డి, ఆయన కుమారుల, కుమార్తెలతో ఆయనతో తమకు గల అనుబంధాన్ని పలువురు గుర్తు చేసుకున్నారు. అంతిమయాత్ర గ్రామ వీధుల గుండా వెళ్తున్నప్పుడు గ్రామ ప్రజలు ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు.

మాజీ జెడ్పిటిసి బక్కారెడ్డి అంత్యక్రియల్లో పాల్గొని పాడే మోస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!