Social 1080×1350 • Multi-page
05-10-2025 BREAKING NEWS 07:31 PM
swarnodayam.com
Telugu Daily News

అనుమానాస్పదంగా గడ్డివాము దగ్ధం.. రూ.15వేల ఆర్థిక నష్టం.

అనుమానాస్పదంగా గడ్డివాము దగ్ధం.. రూ.15వేల ఆర్థిక నష్టం.
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని మామిళ్లవాడలో పశువుల మేత కోసం ఉంచిన గడ్డివాము ఆదివారం అనుమానాస్పదoగా దగ్ధమైంది. వివరాలలోకి వెళితే…

మామిళ్ళవాడకు చెందిన ఎండి హమీద్ తన పశువుల కోసం గడ్డిని కొనుగోలు చేసి భద్రపరుచుకున్నాడు. కాగా ఆదివారం గడ్డివాములో మంటలు రావడంతో గమనించిన స్థానికులు ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను ఆర్పారు. గుర్తుతెలియని వ్యక్తులు గడ్డివాముకు కావాలని నిప్పంటించి ఉండవచ్చని, దీనివల్ల తనకు రూ. 15,000 రూపాయల నష్టం వాటిలినట్లు బాధితుడు తెలిపారు. దీనిపై పోలీసులు విచారణ జరిపి నిందితులను గుర్తించాలని కోరారు.

మామిళ్లవాడలో దగ్ధమవుతున్న పశుగ్రాసం..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!